6 రోజులు @ 9.99లక్షల మందికి వ్యాక్సిన్‌   - till 6 pm 999065 beneficiaries have been vaccinated in india
close
Published : 21/01/2021 21:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

6 రోజులు @ 9.99లక్షల మందికి వ్యాక్సిన్‌ 

దిల్లీ: కరోనా వైరస్‌ను అరికట్టేందుకు చేపట్టిన వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమం ఆరో రోజూ కొనసాగింది. గురువారం సాయంత్రం 6 గంటల వరకు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తంగా 9,99,065మందికి టీకా వేసినట్టు కేంద్రం వెల్లడించింది. ఈ రోజు 27 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో చేపట్టిన వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో 1,92,581 మందికి టీకా వేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి మనోహర్‌ అగ్నాని వెల్లడించారు. ఈ రోజు టీకా వేయించుకున్నవారిలో తెలంగాణ నుంచి 26,441మంది ఉండగా.. ఏపీ నుంచి 15,507మంది ఉన్నట్టు తెలిపారు.  ప్రస్తుతం పంపిణీ చేస్తున్న కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాలు ఎంతో సురక్షితం, సమర్థవంతమైనవన్నారు. ఎవరూ వీటిపై అసత్యాలను, వదంతులను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారిని నియంత్రణలో వ్యాక్సిన్లు కీలక పాత్రపోషిస్తాయని చెప్పారు. మరోవైపు, కో-విన్‌ యాప్‌ సాఫ్ట్‌వేర్‌లో మరికొన్ని మార్పులు చేసి వ్యాక్సిన్‌ అందించే సేవలను మరింతగా విస్తరిస్తామని ఆయన చెప్పారు. 

జనవరి 16న దేశ వ్యాప్తంగా కరోనా టీకాల పంపిణీ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. కరోనాపై పోరులో ముందుండి పనిచేసిన ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు, పోలీసులకు తొలి విడతలో ప్రాధాన్యం కల్పించారు. రెండో విడతలో ప్రధాని నరేంద్రమోదీతో పాటు పలు రాష్ట్రాల సీఎంలకు టీకా అందించనున్నట్టు సమాచారం.

ఇదీ చదవండి..

టీకా వేయించుకోనున్న ప్రధాని మోదీ!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని