close
Published : 16/04/2021 19:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘అశోకవనంలో....’  విశ్వక్‌సేన్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: విశ్వక్‌ సేన్‌ హీరోగా, దర్శకుడు విద్యాసాగర్‌ ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. బి.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్‌ సమర్పణలో ఎస్‌.వి.సి.సి. డిజిటల్‌ పతాకంపై బాపినీడు, సుధీర్‌ ఈదర నిర్మిస్తున్నారు. శుక్రవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించి, టైటిల్‌ని విడుదల చేశారు. ఈ సినిమాకి ‘అశోకవనంలో అర్జున్‌ కల్యాణం’ పేరు ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ని పంచుకుంది చిత్రబృందం. ఓ వారధిపై బస్సు, టైటిల్‌ లోగోలో పక్షులు చూస్తుంటే పల్లెటూరిలో సాగే ప్రేమకథ అనిపిస్తోంది. ఇందులో అర్జున్‌గా కనిపించనున్నాడు విశ్వక్‌.

కథానాయకుడిగా విశ్వక్‌ నటిస్తోన్న 7వ సినిమా ఇది. రవి కిరణ్‌ కోలా కథ అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జయ ఫణి కృష్ణ, కూర్పు: విప్లవ్‌ నైషదం, ఛాయాగ్రహణం: పవిత్రన్‌. నాయిక వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. మరోవైపు ‘పాగల్‌’ చిత్రంలో నటిస్తున్నాడు విశ్వక్‌. ఇది త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని