Team India: పాండ్య సోదరుల పోరాటం చూశారా? - watch team indian brothers hardik pandya and krunal pandya face to face
close
Published : 12/07/2021 01:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Team India: పాండ్య సోదరుల పోరాటం చూశారా?

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా సోదరులు హార్దిక్‌ పాండ్య, కృనాల్‌ పాండ్య తాజాగా పోటీపడ్డారు. వీరిద్దరూ జిమ్‌లో కసరత్తులు చేసి ఒకరిపై ఒకరు గెలవాలనుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో పంచుకొంది.‘ ఇది చూడటానికి తేలికగా ఉన్నా అంత సులభం కాదు. ఈ సవాళ్లను ఇంట్లో ప్రయత్నించాలంటే జాగ్రత్త వహించండి’ అని దానికి వ్యాఖ్యానం జతచేసింది. పాండ్య సోదరులు ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వారిద్దరూ జట్టు స్ట్రెంత్‌ అండ్‌ కండీషనింగ్‌ కోచ్‌ హర్ష ఆధ్వర్యంలో ఫిట్‌నెస్‌ నిరూపించుకునే ప్రయత్నించారు. ఇక్కడ మొత్తం మూడు విభాగాల్లో పాండ్య సోదరులు పోటీపడ్డారు.

అందులో తొలుత గోడకుర్చీ వేయగా కృనాల్‌ పాండ్య విజేతగా నిలిచాడు. ఇక రెండో దాంట్లో గ్లూట్‌ బ్రిడ్జ్‌ ఎక్సర్‌సైజ్‌ (నేలపై పడుకొని నడుము నుంచి కాళ్ల వరకు గాలిలో ఉంచడం)లో హార్దిక్‌ గెలుపొందాడు. దాంతో ఇద్దరూ చెరి సమానంగా నిలిచారు. చివరికి మూడో దాంట్లో స్ల్పిట్‌ స్క్వాట్‌ హోల్డ్‌ (ఒక కాలును వెనక్కి పెట్టి మరో కాలును ముందుకు వంగి నిల్చోవడం) చేశారు. ఇందులో ఇద్దరూ సమానంగా నిలిచారు. మరోవైపు శ్రీలంక జట్టులో ఇద్దరు సహాయక సిబ్బంది కరోనా బారిన పడటంతో వన్డే సిరీస్‌ 13 నుంచి 18కి ఐదు రోజులు వాయిదా పడింది. ఆపై టీ20 సిరీస్‌ కూడా 21 నుంచి 25కు రీషెడ్యూల్‌ అయింది. ఈ నేపథ్యంలోనే శిఖర్‌ ధావన్‌ నేతృత్వంలోని టీమ్‌ఇండియా అక్కడ ప్రాక్టీస్‌ చేస్తూ బిజీగా కొనసాగుతోంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని