సన్నీ, ఇమ్రాన్‌ హష్మీ ఇతడి తల్లిదండ్రులట! - Bihar student claiming he is sunny leone and Emraan Hashmis son actress reacts
close
Published : 12/12/2020 21:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సన్నీ, ఇమ్రాన్‌ హష్మీ ఇతడి తల్లిదండ్రులట!

దరఖాస్తులో పేర్కొన్న విద్యార్థి.. నటి రిప్లై

ముంబయి: బిహార్‌కు చెందిన ఓ కళాశాల విద్యార్థి సన్నీ లియోనీ, ఇమ్రాన్‌ హష్మీ తన తల్లిదండ్రులని దరఖాస్తులో పేర్కొన్నాడు. ముజ‌ఫ‌ర్‌పూర్‌కు చెందిన కుంద‌న్ కుమార్ అనే 20 ఏళ్ల యువ‌కుడు ధనరాజ్‌ మహ్తో డిగ్రీ కాలేజీలో బీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు. త‌ప్పుడు వివ‌రాల‌తో హాల్ టికెట్‌కు ద‌ర‌ఖాస్తు చేశాడు. త‌ల్లి పేరు రాయాల్సిన కాలమ్‌లో స‌న్నీ లియోనీ అని, తండ్రి కాలమ్‌లో ఇమ్రాన్ హ‌ష్మీ అనే పేర్లను రాశాడు. ఇవి బాలీవుడ్‌ తారలు సన్నీ, ఇమ్రాన్‌ పేర్లను తలపిస్తుండటంతో పరీక్షా దరఖాస్తు ఫామ్ వైర‌ల్‌గా మారింది. కుందన్‌ చేసిన తుంటరి పనిని సోషల్‌ మీడియా ద్వారా చూసిన సన్నీ చమత్కారంగా రిప్లై ఇచ్చారు. ‘ఈ పిల్లలు అద్భుతం.. ఇలానే పెద్ద కలలు కంటూ ఉండు..’ అని నవ్వుకున్నారు. స‌ద‌రు విద్యార్థిపై తగిన చర్యలు తీసుకుంటామ‌ని  యూనివ‌ర్సిటీ రిజిస్టార్‌ రామకృష్ణ ఠాకూర్‌ తెలిపారు.

ఇమ్రాన్‌ హష్మీ, సన్నీ కేవలం ఒక్క పాట కోసం మాత్రమే కలిసి పనిచేశారు. ఇదే విషయం తెలుసుకున్న ఇమ్రాన్‌ సైతం సరదాగా రిప్లై ఇచ్చారు. ‘ప్రమాణం చేసి చెబుతున్నా.. అతడితో నాకు సంబంధం లేదు’ అని ట్వీట్‌ చేశారు. సన్నీ చేతిలో ‘వీరమదేవి’, ‘రంగీలా’, ‘కోక కోలా’ తదితర చిత్రాలున్నాయి. ఇవన్నీ ప్రొడక్షన్‌ పరంగా వివిధ దశల్లో పనులు జరుపుకొంటున్నాయి.
ఇదీ చదవండి..
ఎయిర్‌ఫోర్స్‌కు అనిల్‌ కపూర్‌ క్షమాపణలు

చాలా మంది నెటిజన్లు నన్ను ద్వేషిస్తున్నారు..! 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని