చైనాకు చురకలంటించిన ఆస్ట్రేలియా ప్రధాని! - Scott Morrison on China complaints
close
Updated : 19/11/2020 21:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చైనాకు చురకలంటించిన ఆస్ట్రేలియా ప్రధాని!

కాన్‌బెర్రా: చైనా తెస్తోన్న ఒత్తిళ్లకు ఆస్ట్రేలియా తలొగ్గదని ఆ దేశ ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ స్పష్టంచేశారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం చర్యలను ఉటంకిస్తూ చైనా అధికారి విడుదల చేసిన జాబితాపై ఆయన‌ ఈ విధంగా స్పందించారు. తమ దేశ ప్రయోజనాలకు అనుగుణంగానే తమ చట్టాలు ఉంటాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరి ఒత్తిడికి తలొగ్గమని చైనాకు చురుకలంటించారు.

ఆస్ట్రేలియా విధానాలకు సంబంధించిన దాదాపు 14 అంశాలపై ఫిర్యాదు చేస్తూ చైనా అధికారి ఆస్ట్రేలియా మీడియాకు ఓ జాబితాను అందించారు. ఇందులో గత కొన్నిరోజులుగా ఇరుదేశాల మధ్య నెలకొన్న విభేదాలను సదరు అధికారి ప్రస్తావించారు. మీరు చైనాను శత్రువుగా చూస్తే, చైనా శత్రువు అవుతుందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఆస్ట్రేలియా కఠినమైన చట్టాలు, హువావేపై నిషేధం, ఆస్ట్రేలియాలో చైనా కంపెనీల పెట్టుబడులపై ఆంక్షలను ఆయన ఎత్తిచూపారు. కరోనా విషయంలోనూ అమెరికాకు వంతపాడుతోందని ఆస్ట్రేలియాను విమర్శించారు.

దీనిపై ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్‌ స్పందించారు. ఇది చైనా రాయబార కార్యాలయం నుంచి వచ్చిన అనధికార పత్రమన్న ఆయన‌, తమ జాతి ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్న చట్టాలు, విధానాల రూపకల్పనలను ఎవరూ అడ్డుకోలేరని తిప్పికొట్టారు. ఇక ఈ విషయంపై అమెరికా కూడా స్పందించింది. ఆస్ట్రేలియా తీసుకుంటున్న చర్యలపై బీజింగ్‌ కలత చెందిందని వైట్‌హౌస్‌ నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ పేర్కొంది. ఇటువంటి చర్యలు తీసుకోవడంలో ఆస్ట్రేలియాను అనుసరించే దేశాల సంఖ్య మరింత పెరగనుందని అభిప్రాయపడింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని