Covid: ‘బీమా’రి వస్తే..లేదు ధీమా
close
Updated : 22/06/2021 08:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Covid: ‘బీమా’రి వస్తే..లేదు ధీమా

● జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో వైద్య ఖర్చులు భరించలేక బాధిత కుటుంబాల్లో చాలామంది అప్పులపాలయ్యారు. కరోనాకు చికిత్స చేయించుకునేందుకు కొందరు బంగారం తనఖా పెట్టగా.. మరికొందరు ఇళ్ల స్థలాలు విక్రయించి ఆసుపత్రి బిల్లులు చెల్లించిన ఉదంతాలూ ఉన్నాయి. ప్రస్తుతం వైద్య ఖర్చులు భరించలేనంతగా పెరగడంతో ఉద్యోగుల్లో ఎక్కువమంది నిర్ణీత మొత్తంలో ఆరోగ్యబీమా పాలసీలను తీసుకుంటున్నారు. కరోనా ఉద్ధృతి అనంతరం వారిలో చాలామంది బీమా మొత్తాన్ని రూ.10లక్షల వరకు పెంచుకున్నారు. అదే సమయంలో ఇప్పటికీ బీమా రక్షణ లేనివారు సగం మంది వరకు ఉన్నారు. తాజాగా కేంద్రం వెల్లడించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019-20 ప్రకారం.. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల పరిధిలో ప్రభుత్వం కల్పించే వైద్యబీమా, ప్రైవేటుగా ఆరోగ్యబీమా పాలసీల ధీమా ఉన్నవారు సగంమందే ఉన్నట్లు తేలింది. మిగతా వారు ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చి పెద్దాసుపత్రిలో చేరితే ఆర్థికంగా కుదేలయ్యే పరిస్థితుల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో.. ఆర్థికంగా వెసులుబాటు ఉన్నవారు కుటుంబీకుల ఆరోగ్య రక్షణ కోసం తక్కువలో తక్కువ రూ.5 లక్షల పరిమితితో కూడిన ఆరోగ్యబీమా ఉండేలా ఇప్పటికైనా జాగ్రత్తపడాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వం సైతం అందరికి రూ.5 లక్షల వరకు ఆరోగ్యబీమా సదుపాయం ఏ ఆసుపత్రిలోనైనా వర్తించేలా చర్యలు చేపడితే సామాజికంగా పెద్ద ముందడుగు అవుతుందని వారు చెబుతున్నారు. ఐదేళ్లకోసారి నిర్వహించే ఈ ఆరోగ్య సర్వేలో కొన్ని అంశాల్లో స్వల్పంగా మెరుగుదల కనిపించినా.. ఇంకా చాలా విషయాల్లో వెనుకంజలోనే ఉన్నట్లు స్పష్టమైంది. వ్యక్తిగతంగా ఆరోగ్య సంరక్షణకు సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని సర్వే ప్రస్తావించింది. దేశవ్యాప్తంగా మూడింట ఒక వంతు జనాభాలో మధుమేహం, అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు ఉన్నారు. మహిళల్లోనూ 45 శాతానికి మించి అధిక బరువుతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పలు విషయాలు సర్వేలో బహిర్గతమయ్యాయి. వివరాలివీ..

మధుమేహం అధిక రక్తపోటు మద్యపానం/ధూమపానం 

పురుషులు మహిళలు

హైదరాబాద్‌ 26.8 21.2 41.7 30.2 28/12.4 1.7/0.7

రంగారెడ్డి 28.5 15.3 35.0 28.5 46.8/18.9 6.7/4.5

మేడ్చల్‌ 18.6 16.5 34.8 26.5 39.3/17.9 2.4/3.0

ఆరోగ్య బీమా ఉన్న కుటుంబాల సంఖ్య (శాతాల్లో)

రంగారెడ్డి

మేడ్చల్‌

హైదరాబాద్‌

48.9

58.3

53.8


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని