TNR కుటుంబానికి మారుతి సాయం - director maruthi helps to tnr family
close
Published : 13/05/2021 14:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TNR కుటుంబానికి మారుతి సాయం

హైదరాబాద్‌: నటీనటులు, వారి కుటుంబసభ్యులకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సినీ పరిశ్రమ మొత్తం ఏకతాటి మీదకు వచ్చి తమకు చేతనైనంత సాయం చేస్తుంది. తాజాగా ఈ విషయం మరోసారి నిరూపితమైంది. ప్రముఖ సినీ జర్నలిస్ట్‌, వ్యాఖ్యాత, నటుడు టీఎన్‌ఆర్‌ ఇటీవల కరోనాతో మృతి చెందిన విషయం తెలిసిందే. టీఎన్‌ఆర్‌ మృతిపట్ల సంతాపం తెలిపిన సినీ ప్రముఖులు.. ఆయన కుటుంబానికి ఆర్థికసాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా దర్శకుడు మారుతి రూ.50 వేలను తక్షణ ఆర్థికసాయంగా టీఎన్‌ఆర్‌ కుటుంబసభ్యులకు అందించారు. ‘టీఎన్‌ఆర్‌ మేము నిన్ను ఎంతో మిస్‌ అవుతున్నాం. కానీ, మీ కుటుంబానికి అండగా ఉంటాం. మీరు కూడా ఆ కుటుంబానికి సాయం అందించండి’ అని మారుతి ట్వీట్‌ చేశారు. మరోవైపు చిరంజీవి, సంపూర్ణేష్‌బాబు సైతం తమవంతు సాయంగా కొంత మొత్తాన్ని టీఎన్‌ఆర్‌ కుటుంబానికి అందించిన విషయం విదితమే. అంతేకాకుండా ఇప్పటికే చిరంజీవి టీఎన్‌ఆర్‌ సతీమణిని ఫోన్‌లో పరామర్శించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని