BB3లో శ్రీకాంత్‌ ఫిక్స్‌ - srikanth in bb3
close
Published : 24/03/2021 12:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

BB3లో శ్రీకాంత్‌ ఫిక్స్‌

హైదరాబాద్‌: నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ‘సింహా’, ‘లెజెండ్‌’ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో రానున్న హ్యాట్రిక్‌ చిత్రమిది. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో నటుడు శ్రీకాంత్‌ భాగమయ్యారు. ఇందులో ఆయన ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. శ్రీకాంత్‌ బర్త్‌డే సందర్భంగా విషెస్‌ తెలుపుతూ తాజాగా చిత్రబృందం ఓ పోస్టర్‌ పంచుకుంది. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రగ్యాజైశ్వాల్‌ ఓ కథానాయికగా కనిపించనున్నారు. వేసవి కానుకగా మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది.




మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని