close

తాజావార్తలు

పురాతత్వ శాస్త్రవేత్తగా నాగ్‌..?

ముంబయి‌: భారీ బడ్జెట్‌తో బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. బాలీవుడ్‌ జంట ఆలియా భట్‌, రణబీర్‌ కపూర్‌ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌, టాలీవుడ్‌ నటుడు నాగార్జున కీలకపాత్రలు పోషిస్తున్నారు. గతకొంతకాలం క్రితం ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమయ్యింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో నాగార్జున పురాతత్వ శాస్ర్తవేత్తగా కనిపించనున్నారు. ఆయన పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉండబోతుందట. ఈ చిత్రంలో ఆయన తన విద్యార్థులతో కలిసి గంగానది ఒడ్డున ఓ పురాతన ఆలయాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తుంటారని తెలుస్తోంది. ఆయన ఎంట్రీ తర్వాత సినిమా చాలా ఆసక్తికరంగా ఉండబోతోందని బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.