24 గంటల్లో 70 వేల మెట్లు ఎక్కి హిమ్మత్‌సింగ్‌ ప్రపంచ రికార్డు!

రాజస్థాన్‌లోని జయపురకు చెందిన మాజీ కమాండో హిమ్మత్‌సింగ్‌ రాఠోడ్‌ (40) ఇరవై నాలుగు గంటల్లో 70,679 మెట్లు ఎక్కి ప్రపంచ రికార్డును బద్దలుకొట్టారు.

Published : 09 May 2024 06:06 IST

ఈటీవీ భారత్‌: రాజస్థాన్‌లోని జయపురకు చెందిన మాజీ కమాండో హిమ్మత్‌సింగ్‌ రాఠోడ్‌ (40) ఇరవై నాలుగు గంటల్లో 70,679 మెట్లు ఎక్కి ప్రపంచ రికార్డును బద్దలుకొట్టారు. స్పెయిన్‌కు చెందిన క్రిస్టియన్‌ రాబర్టో (70,200 మెట్లు) పేరిట ఉన్న రికార్డును ఈయన అధిగమించారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలనే సందేశాన్ని చాటేందుకు ఈ రికార్డు సృష్టించినట్లు హిమ్మత్‌సింగ్‌ తెలిపారు. స్థానిక వైశాలి నగర్‌లో మొత్తం 439 మెట్లున్న 20 అంతస్తుల భవనాన్ని హిమ్మత్‌సింగ్‌ 81 సార్లు ఎక్కి, 80 సార్లు దిగారు. సోమవారం (మే 6) సాయంత్రం 5.30 గంటలకు మెట్లు ఎక్కడం ప్రారంభించి, మంగళవారం సాయంత్రం 5.22 గంటలకు పూర్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలల పీఈటీల బృందం ఈ విన్యాసాన్ని పర్యవేక్షించింది. హిమ్మత్‌సింగ్‌ మెట్లు ఎక్కుతున్న దృశ్యాలను  గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌కు పంపుతామని పీఈటీ సంతోష్‌ రాఠోడ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని