
తాజా వార్తలు
రైతుబీమా సొమ్ముకోసం తండ్రినే చంపేశాడు!
వికారాబాద్ జిల్లాలో ఘటన
యాలాల: రైతు బీమాకు ఆశపడి కన్నతండ్రినే ఓ వ్యక్తి బండరాయితో కొట్టి చంపాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని సంగెం కుర్దు గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన చింతల రుస్తుంకు సంగీత(17), సురేశ్(19), శేఖర్ (25) సంతానం. రుస్తుంకు మూడెకరాల పొలం ఉండగా ఇద్దరు కుమారులకు ఒక్కో ఎకరా పట్టా చేసి మిగిలిన ఎకరాను తన పేరు మీద ఉంచుకున్నాడు. ఆదివారం సాయంత్రం పొలంలో కుటుంబసభ్యులు విందు చేసుకున్నారు. ఈ క్రమంలో రుస్తుం మద్యం సేవించి రాత్రి అక్కడే నిద్రించాడు. పెద్ద కుమారుడైన శేఖర్.. తన తండ్రిని చంపితే రూ. 5లక్షల బీమా వస్తుందని భావించాడు. దీంతో మద్యం మత్తులో ఉన్న తండ్రిపై బండరాయితో మోదాడు. దీంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. శేఖర్ వ్యవహార శైలిలో అనుమానం రావడంతో గ్రామస్థులు అతడ్ని పోలీసులకు పట్టించారు. ఈ ఘటనపై యాలాల పోలీసులు డీఎస్పీ లక్ష్మీనారాయణ, సీఐ జలందర్ రెడ్డికి సమాచారం అందించారు. మృతుని చిన్న కుమారుడు సురేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- 2-1 కాదు 2-0!
- ఇక చాలు
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- బైడెన్.. హారిస్ సీక్రెట్ కోడ్ పేర్లు ఏంటంటే..!
- సాహో భారత్!
- కొవిడ్ టీకా అలజడి
- కీలక ఆదేశాలపై జో బైడెన్ సంతకం
- అందరివాడిని
- తీరని లోటు మిగిల్చిన ఓటమి: వార్న్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
