ఇన్‌స్పెక్టర్‌ భార్యకు సైబర్‌ నేరగాళ్ల టోకరా!
close

తాజా వార్తలు

Updated : 18/06/2021 12:26 IST

ఇన్‌స్పెక్టర్‌ భార్యకు సైబర్‌ నేరగాళ్ల టోకరా!

హైదరాబాద్: నగర పరిధిలోని ఓ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్ సతీమణికి సైబర్‌ నేరగాళ్లు టోకరా వేశారు. ఆమె నుంచి రూ.1.04 లక్షలు కాజేశారు. నగర పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ సతీమణి ఆన్‌లైన్‌లో రూ.500 విలువ చేసే చీరను ఆర్డర్ చేశారు. డెలివరీ అనంతరం ప్యాకెట్ విప్పి చూస్తే ఆమె ఆర్డర్ చేసిన చీర రాలేదు. సంబంధిత సంస్థను సంప్రదించేందుకు సంస్థ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేశారు. ప్యాకింగ్ చేసేప్పుడు పొరపాటు జరిగి ఉంటుందని.. మీ డబ్బులు తిరిగి పంపిస్తామని చెప్పారు. ఆమె బ్యాంక్ ఖాతా నంబరు తెలుసుకొని క్యూఆర్ కోడ్ పంపించారు. కోడ్‌ స్కాన్‌ చేయగానే బాధితురాలి ఖాతాలోంచి రూ.45 వేలు మాయమయ్యాయి. ఇదేంటని అడిగితే పొరపాటు జరిగిందంటూ మరో కోడ్ పంపించారు. దానిని స్కాన్‌ చేయగానే మరో రూ.25 వేలు అకౌంట్‌ నుంచి పోయినట్లు మెసేజ్‌ వచ్చింది. ఇదే విధంగా మరో రూ.25 వేలు, రూ.9 వేలు బాధితురాలిని మోసం చేసి తీసుకున్నారు. ఇలా మొత్తం రూ. 1.04 లక్షలను సైబర్‌ నేరగాళ్లు దండుకున్నారు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని