Sushant Singh case: డ్రగ్స్‌ వ్యాపారి అరెస్టు
close

తాజా వార్తలు

Updated : 03/06/2021 01:43 IST

Sushant Singh case: డ్రగ్స్‌ వ్యాపారి అరెస్టు

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. 2020 జూన్‌ 14న సుశాంత్‌ అనుమానస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. సుశాంత్‌ కేసు దర్యాప్తులో డ్రగ్స్‌ వ్యవహారం వెలుగు చూసింది. అది కాస్తా బాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. ఈ కేసును సీబీఐ, ఎన్‌సీబీ (నార్కోటిక్స్‌ సెంట్రల్‌ బ్యూరో), ఈడీ, (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) దర్యాప్తు చేస్తున్నాయి. ఈ కేసులో మరో ముందడుగు పడింది. డ్రగ్స్‌ వ్యాపారి హరీశ్‌ఖాన్‌ను ఎన్‌సీబీ అరెస్టు చేసింది.

ఈ కేసులో నిందితుడిగా ఉన్న సిద్ధార్థ్‌ పిఠానిని ఇటీవల (మే 26న) హైదరాబాద్‌లో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సుశాంత్‌ ఇంట్లో పనిచేసే నీరజ్‌, కేశవ్‌ను కూడా అధికారులు విచారించారు. సిద్ధార్థ్‌ చేసిన వాట్సాప్‌ చాట్‌ ఆధారంగా హరీశ్‌తో సంబంధాలు ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో డ్రగ్స్‌ వ్యాపారి హరీశ్‌ఖాన్‌ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. సుశాంత్‌ మృతి కేసులో నిందితురాలిగా ఉన్న అతని ప్రేయసి రియా చక్రవర్తిని, ఆమె సోదరుడిని గతేడాది అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దాదాపు నెల రోజులపాటు జైలులో ఉన్న తర్వాత ఆమెకు ముంబయి హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. తర్వాత కొంతకాలానికి ఆమె సోదరుడు కూడా బెయిల్‌పై బయటికి వచ్చాడు.

ఇదిలా ఉండగా.. తన కుమారుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ జీవిత చరిత్రపై సినిమాలు తీయడంపై నిషేధం విధించాలంటూ సుశాంత్‌ తండ్రి కృష్ణ కిషోర్‌ సింగ్‌ హైకోర్టును ఆశ్రయించారు. తీర్పును దిల్లీ హైకోర్టు రిజర్వు చేసింది. సుశాంత్‌సింగ్‌ జీవిత చరిత్ర ఆధారంగా ‘న్యాయ్‌’ అనే చిత్రాన్ని ఇప్పటికే తెరకెక్కించారు. అది జూన్‌ 11న విడుదల కావాల్సి ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని