close

తాజా వార్తలు

Published : 26/01/2021 10:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బస్సు ప్రమాదంలో 12 మందికి గాయాలు

ఇచ్ఛాపురం: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పట్టణ బైపాస్‌ మార్గంలో పాత టోల్‌ప్లాజా వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మందికి గాయాలయ్యాయి. విశాఖపట్నం నుంచి ఒడిశాలోని భువనేశ్వర్‌కు వెళ్తున్న ప్రైవేటు బస్సు పాత టోల్‌ప్లాజా వద్దకు రాగానే అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా ఎనిమిది మంది స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఇచ్ఛాపురం ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒడిశాలోని బ్రహ్మపుర వైద్య కళాశాలకు తరలించారు.  పట్టణ ఎస్సై సత్యనారాయణ ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. ఘటనలో గాయపడిన వారంతా ఒడిశాకు చెందినవారేనని ఎస్సై తెలిపారు. డ్రైవర్‌ నిద్ర మత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు.

ఇవీ చదవండి..

ఓ ప్రజాప్రతినిధి మా స్థలం కబ్జా చేశారయ్యా!

ప్రేమికుల ఉసురు తీసిన పెళ్లి ప్రస్తావన



Tags :

క్రైమ్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని