Crime News: పొలాల్లో బాలుడి మృతదేహం.. చిత్తూరు జిల్లాలో దారుణం

తాజా వార్తలు

Updated : 13/10/2021 16:46 IST

Crime News: పొలాల్లో బాలుడి మృతదేహం.. చిత్తూరు జిల్లాలో దారుణం

కేవీ పల్లి(కమ్మంవారి పల్లి): చిత్తూరు జిల్లా కమ్మంవారి పల్లిలో దారుణం చోటు చేసుకుంది. నిన్న అదృశ్యమైన చిన్నారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఎంవీ పల్లి పంచాయతీ ఎగువమేకలవారి పల్లికి సమీపంలో పొలాల్లో బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని గేరంపల్లి పంచాయతీ సంకేనిగుట్టపల్లికి చెందిన నాగిరెడ్డి దంపతులు తమ కుమారుడు తేజశ్‌ రెడ్డి(8)ని పీలేరులోని బంధువుల ఇంట్లో వదిలి.. భార్యాభర్తలిద్దరూ ఉపాధి నిమిత్తం కువైట్‌ వెళ్లారు. కాగా, సోమవారం బాలుడు తన అమ్మమ్మ స్వగ్రామమైన ఎగువమేకలవారి పల్లెకు వచ్చాడు. మంగళవారం మధ్యాహ్నం సమయంలో తేజశ్‌ రెడ్డి తన అమ్మమ్మకు చెప్పి ఆడుకునేందుకని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తర్వాత ఎంతసేపటికీ ఇంటికి రాకపోయేసరికి కుటుంబసభ్యులు చుట్టుపక్కలంతా వెతకగా ఫలితం లేకపోయింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న కమ్మంవారిపల్లె పోలీసులు.. బాలుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం గ్రామానికి సమీపంలోని పొలంలో బాలుడు మృతిచెంది ఉండటం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని