భార్యను నాటు తుపాకీతో కాల్చి చంపిన భర్త

ప్రధానాంశాలు

Published : 17/10/2021 04:24 IST

భార్యను నాటు తుపాకీతో కాల్చి చంపిన భర్త

మెళియాపుట్టి, న్యూస్‌టుడే : తాగిన మైకంలో ఓ వ్యక్తి తన భార్యను నాటు తుపాకీతో కాల్చి చంపేశాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలో భరణికోట కాలనీ అనే గిరిజన తండాలో వెలుగు చూసింది. భరణికోట కాలనీకి చెందిన సవర పద్మ(33), జగ్గరావు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు. మద్యం అలవాటున్న జగ్గరావు ఆ మత్తులో తరచూ భార్యతో గొడవ పడుతుండేవాడు. శనివారం మధ్యాహ్నం కూడా ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకుంది. అప్పటికే మత్తులో ఉన్న జగ్గరావు తన వద్ద ఉన్న నాటు తుపాకీతో పద్మను కాల్చేశాడు. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. గ్రామస్థుల చొరవతో విషయం బయటకు పొక్కి, పోలీసుల వరకు చేరింది. జంతువుల నుంచి రక్షణ కోసమని గిరిజనులు నాటు తుపాకులను తమ వద్ద ఉంచుకుంటున్నారు. ప్రస్తుతం అవే వారి ప్రాణాలు తీస్తున్నాయి.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన