బాలికపై పాస్టర్‌ లైంగిక దాడికి యత్నం
eenadu telugu news
Published : 06/07/2021 05:39 IST

బాలికపై పాస్టర్‌ లైంగిక దాడికి యత్నం


గంగాధర్‌

 

సర్పవరం జంక్షన్‌: ఓ చర్చి పాస్టర్‌ మాయమాటలు చెప్పి ఓ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన సర్పవరం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ రాజశేఖర్‌ తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని ఒక గ్రామానికి చెందిన కలవాల గంగాధర్‌ అలియాస్‌ సుధాకర్‌ అనే పాస్టర్‌ గత నెల 28న 10 ఏళ్ల వయస్సున్న చిన్నారికి మాయమాటలు చెప్పి చర్చికి దూరంగా ఉన్న పశువుల పాకలోకి తీసుకెళ్లాడు. చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించి లైంగిక దాడికి యత్నించాడు. ఆమె పెద్దగా కేకలు వేయడంతో బాలిక చేతిలో రూ.50 పెట్టి ఎవ్వరికీ చెప్పవద్దని హెచ్చరించి పారిపోయాడు. ఈ సంఘటనపై గ్రామంలో పెద్దలు బాలిక తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకువచ్చి రాజీ చేయడానికి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ 4వ తేదీ అర్ధరాత్రి ఇచ్చిన ఫిర్యాదుపై సోమవారం విచారణ చేపట్టారు. అతనిపై పోక్సో కేసు నమోదు చేయడంతోపాటు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించినట్లు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని