వాహనం ఢీకొని లారీ డ్రైవర్‌ మృతి
logo
Published : 07/05/2021 02:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వాహనం ఢీకొని లారీ డ్రైవర్‌ మృతి

కొడవలూరు, న్యూస్‌టుడే: గుర్తుతెలియని వాహనం ఢీకొని లారీ డ్రైవర్‌ మృతి చెందిన సంఘటన   నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని నాయుడుపాళెంలో జాతీయరహదారిపై బుధవారం అర్థరాత్రి జరిగింది. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలోని పెదకలపాడు గ్రామానికి చెందిన జ్ఞానసుందరం (34) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఖమ్మం నుంచి మిర్చి లోడుతో చెన్నైకి వెళుతున్నారు. బుధవారం రాత్రి 12 గంటల ప్రాంతంలో  నాయుడుపాళెం వద్దకు వచ్చేసరికి నిద్ర రావడంతో రోడ్డుపక్కన నిలిపారు. లారీలోనే క్లీనర్‌ కార్తీక్‌ నిద్రకు ఉపక్రమించారు. ఫోన్‌ రావడంతో జ్ఞానసుందరం లారీ దిగి రోడ్డుపై నడుస్తూ మాట్లాడుతున్నారు. ఓగంట  నిద్రపోయి లేచిన కార్తీక్‌ చూస్తే డ్రైవర్‌ కనిపించలేదు. అనుమానం వచ్చి రోడ్డుపై చూడగా మృతి చెంది ఉన్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనాస్థలానికి వచ్చి పరిశీలించారు. బంధువులకు విషయాన్ని తెలియజేశారు. మృతుడికి నలుగురు పిల్లలున్నట్లు తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జి. సుబ్బారావు పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని