డీఎస్పీల ఉద్యోగోన్నతులకు రంగం సిద్ధం
eenadu telugu news
Published : 19/10/2021 04:02 IST

డీఎస్పీల ఉద్యోగోన్నతులకు రంగం సిద్ధం

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్పీ స్థాయి అధికారులకు అదనపు ఎస్పీలుగా ఉద్యోగోన్నతులు కల్పించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు అర్హులైన వారి జాబితాను తయారు చేసి సంబంధిత జిల్లా అధికారులకు డీజీపీˆ కార్యాలయం పంపింది. వీరి వివరాలను పంపించాలంటూ డీజీపీˆ డి.గౌతం సవాంగ్‌ ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. దీనిలో భాగంగా కృష్ణాజిల్లాలో అయిదుగురు ఉద్యోగోన్నతులు పొందేందుకు అర్హత సాధించారు. వీరిలో ముగ్గురు విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌లో పని చేస్తుండగా.. మిగిలిన ఇద్దరు వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని