సర్దుబాట వేసుకుందాం
eenadu telugu news
Published : 19/10/2021 05:48 IST

సర్దుబాట వేసుకుందాం

ఈనాడు డిజిటల్‌, తిరుపతి :  న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు(ఎన్‌డీబీ) రుణ సహాయంతో చేపట్టదలచిన రహదారుల అభివృద్ధి పనులకు ఎట్టకేలకు మోక్షం కలిగేలా ఉంది. బ్యాంకు నిబంధనల విషయమై పట్టువిడుపులకు పోకుండా సర్దుబాటు ధోరణిలో వెళ్లాలని ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకున్నట్లు రోడ్లు, భవనాల శాఖ (ఆర్‌అండ్‌బీ) వర్గాలు తెలిపాయి. టెండర్లు చేపట్టి దాదాపు ఏడాది కావస్తున్నా.. పనుల్లో ప్రగతి కనిపించలేదు. రెండు వరుసలతో అభివృద్ధికి ఎంపిక చేసిన రోడ్లను మరమ్మతులు చేపట్టకుండా వదిలిపెట్టింది. అటు అభివృద్ధి పనులు చేపట్టక.. ఇటు మరమ్మతులకు నోచుకోక రహదారులపై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో మండల కేంద్రాలను కలుపుతూ పది కీలక రహదారులను మొదటి దశలో ఎంపిక చేశారు. వీటికి రూ.126.15 కోట్ల రుణం ఇవ్వడానికి ఎన్‌డీబీ ముందుకొచ్చింది. అన్ని రహదారుల పనులను పీఎల్‌ఆర్‌ సంస్థ దక్కించుకుంది. 24 నెలల వ్యవధిలో పనులు పూర్తి చేయాలనే నిబంధన మేరకు ఒప్పందం కూడా జరిగింది. ఈ క్రమంలో రుణం ఇస్తున్న బ్యాంకు ఓ మెలిక పెట్టింది. రహదారి పనులు చేపట్టి దశల వారీగా బిల్లులు చెల్లించే పక్షంలో అనంతరం నిధులు విడుదల చేస్తామని తేల్చింది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ముందస్తుగా నిధులు ఖర్చు చేసి అనంతరం యూసీలు పంపి రుణం పొందడంపై తర్జనభర్జన జరిగింది. ఏదో రూపంలో ముందస్తుగా నిధులు సర్దుబాటు చేసి గుత్తేదారు పనులు చేపట్టేలా చూడాలని ఇంజినీరింగ్‌ అధికారులకు ఉన్నతాధికారులు సంకేతాలిచ్చినట్లు సమాచారం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని