జేఈఈలో శ్రీషిర్డిసాయి భళా
eenadu telugu news
Published : 16/09/2021 05:44 IST

జేఈఈలో శ్రీషిర్డిసాయి భళా


సాయిరాజ్‌ను అభినందిస్తున్న శ్రీ షిర్డిసాయి విద్యాసంస్థల ఛైర్మన్‌ శ్రీధర్‌

రాజమహేంద్రవరం(దానవాయిపేట): జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో రాజమహేంద్రవరం శ్రీ షిర్డిసాయి జూనియర్‌ కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారని ఆ విద్యాసంస్థల ఛైర్మన్‌ తంబా బత్తుల శ్రీధర్‌ తెలిపారు. తమ లక్ష్యా ఐఐటీ అకాడమీ విద్యార్థి కె.సాయిరాజ్‌ జాతీయ స్థాయిలో 23వ ర్యాంకు, ఎం.శశిధర్‌ 259, టి.ఫల్గుణ శ్రీరామ్‌ 393, జి.శ్రీలక్ష్మి ఉత్తేజ్‌ 776వ ర్యాంకులు సాధించారన్నారు. తమ విద్యార్థులు వేయి లోపు నాలుగు, రెండు వేల లోపు తొమ్మిది, మూడు వేల లోపు 23 ర్యాంకులు సాధించారన్నారు. కళాశాల నుంచి 124 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా వారిలో 91 మంది జేఈఈ అడ్వాన్స్‌కు అర్హత సాధించారన్నారు. 45 మంది ఐఐటీలో సీట్లు సాధించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ మేరకు విద్యార్థులను విద్యాసంస్థల డైరెక్టర్‌ శ్రీవిద్య, లక్ష్యా అకాడమీ డీన్‌ చంద్రశేఖర్‌ అభినందించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని