మెరిసిన ప్రతిభ
eenadu telugu news
Published : 16/09/2021 05:44 IST

మెరిసిన ప్రతిభ


ముఖేశ్‌ సామిరెడ్డి

కాకినాడ(భానుగుడి సెంటర్‌): రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన పాలిసెట్‌-21 పరీక్షల్లో కాకినాడ ఆదిత్య పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించారని ఆ విద్యాసంస్థల సెక్రటరీ ఎన్‌.కృష్ణదీపక్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బి.భవిత, జి.మనోజ్ఞ రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంకులు, పి.ముకేష్‌సామి రెడ్డి, వి.రోహన్‌ శివతేజ 19వ ర్యాంకులు సాధించారని పేర్కొన్నారు. 100 లోపు 42, 54, 71, 73 ర్యాంకులు, వెయ్యి లోపు 42 ర్యాంకులు సాధించి ప్రతిభ చాటారన్నారు. వారిని ఆదిత్య విద్యా సంస్థల ఛైర్మన్‌ డాక్టర్‌ నల్లమిల్లి శేషారెడ్డి అభినందించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని