ఇస్కాన్‌ దేవాలయ అభివృద్ధికి సహకారం
eenadu telugu news
Published : 05/08/2021 00:57 IST

ఇస్కాన్‌ దేవాలయ అభివృద్ధికి సహకారం


అయోధ్య రామిరెడ్డికి వినతిపత్రం ఇస్తున్న రామ్‌ మురారి దాస్‌

గుంటూరు సాంస్కృతికం న్యూస్‌టుడే: కొండవీడులోని ఇస్కాన్‌ స్వర్ణ హంస దేవాలయ అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరిస్తానని రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి హామీ ఇచ్చారు. బృందావన్‌ గార్డెన్స్‌లోని తెలుగు భాషాభివృద్ధి సంఘ సభ్యుడు మోదుగుల పాపిరెడ్డి నివాసంలో ఇస్కాన్‌ కొండవీడు ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ రామ్‌ మురారి దాస్‌ నేతృత్వంలో ప్రతినిధి వర్గం అయోధ్యరామిరెడ్డిని బుధవారం కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా రామ్‌ మురారి దాస్‌ మాట్లాడుతూ 17 ఎకరాల విశాల కేంద్రంలో రూ.200 కోట్లతో నిర్మించతలపెట్టిన ‘వెన్నముద్ద కృష్ణ మందిరం’ నిర్మాణానికి 108 మండపాలు పూర్తి అయ్యాయన్నారు. దేవాలయం నిర్మాణం పూర్తయితే జిల్లాకు మంచి పర్యాటక భక్తి క్షేత్రంగా విరాజిల్లుతుందని చెప్పారు. ఆవరణలో పిల్లలు, స్త్రీలు, వృద్ధులు, గోమాతల సంరక్షణతో పాటు వేద పాఠశాలల పోషణ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఉందన్నారు. ఇస్కాన్‌ కొండవీడు ప్రాజెక్టుకు స్టీరింగ్‌ కమిటీ ఛైర్మన్‌గా ఉండేందుకు అయోధ్యరామిరెడ్డి సమ్మతించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఇస్కాన్‌ కొండవీడు ప్రాజెక్ట్‌ స్టీరింగ్‌ కమిటీ సభ్యులు మోదుగుల పాపిరెడ్డి, జూపూడి రంగరాజు, నడింపల్లి గురుదత్‌, ఎస్వీ కమలాకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని