రూ.4.57 లక్షల ఎరువుల పట్టివేత
eenadu telugu news
Published : 21/10/2021 03:32 IST

రూ.4.57 లక్షల ఎరువుల పట్టివేత


నిల్వ చేసిన ఎరువుల బస్తాలు

లేమల్లెపాడు (వట్టిచెరుకూరు), న్యూస్‌టుడే: మండలంలోని లేమల్లెపాడులో ప్రభుత్వ ఆనుమతి లేని ఓ దుకాణంలో నిల్వ చేసిన రూ.4.57 లక్షల విలువైన ఎరువులను వ్యవసాయాధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. గ్రామ ప్రధాన కూడలిలో ఇటీవల కొత్త ఎరువుల దుకాణం వెలిసింది. దీని నిర్వాహకులు ఎరువుల అమ్మకాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు పొందలేదు. ఇందులో మొక్కల పెరుగుదలకు అవసరమైన స్థూల, సూక్ష్మ పోషకాల (ఘన, ద్రవ రూపం) ఎరువులు 400 బస్తాలు, 360 మందుల సీసాలను నిల్వ ఉంచి రైతులకు అమ్ముతున్నారు. గుంటూరు నగరానికి చెందిన ఓ వ్యక్తి గడిచిన ఐదు రోజులుగా ఇక్కడికి వచ్చి వీటిని విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న వ్యవసాయశాఖాధికారి ఎం.లక్ష్మి, ఆర్‌బీకే ఇన్‌ఛార్జి దుర్గానాయక్‌ బుధవారం దుకాణంపై దాడులు జరిపి ఎరువులను పట్టుకున్నారు. అధికారుల రాకతో దుకాణం నిర్వాహకులు పారిపోయారు. వారిపై కేసు నమోదు చేస్తామని వ్యవసాయశాఖ అధికారి వెల్లడించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని