Updated : 25/01/2021 09:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తెరాస, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ

మేడ్చల్‌ : జగద్గిరిగుట్టలో తెరాస, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. జగద్గిరిగుట్ట కార్పొరేటర్ జగన్ అనుచరులు రాత్రి మద్యం మత్తులో తమపై దాడి చేశారంటూ భాజపా కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో గాయపడ్డ భాజపా కార్యకర్త వసుంధరను ఆసుపత్రికి తరలించారు.

గ్రేటర్ ఎన్నికల సమయంలో తమపై కక్ష పెంచుకుని ఇప్పుడు దాడి చేశారని భాజపా కార్యకర్తలు అంటున్నారు. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనపై భాజపా కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇవీ చదవండి..
తెరాస, భాజపా నాయకుల బాహాబాహీ

బాబ్లీపై తెలంగాణ సీఎం స్పందించరేం?



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని