పీఓపీ వ్యర్థాల సంగతేంటి?
eenadu telugu news
Published : 21/09/2021 02:11 IST

పీఓపీ వ్యర్థాల సంగతేంటి?

పూర్తిస్థాయిలో అమలుకాని న్యాయస్థానం ఆదేశాలు!

ఈనాడు, హైదరాబాద్‌: నిమజ్జన వేడుక నగరంలో ప్రశాంతంగా ముగిసినప్పటికీ.. నిమజ్జన కేంద్రాల్లోని వ్యర్థాల తొలగింపు ప్రక్రియ ఆదివారం అస్తవ్యస్తంగా మారింది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాల ప్రకారం.. నిమజ్జన కోనేరుల్లోని విగ్రహాలను పూర్తిగా తొలగించి.. బల్దియా అధికారులు దాదాపు ఆ పని పూర్తి చేశారు. అయితే కోనేరుల నిండా ఉన్న నీటిని అలాగే ఉంచేశారు. న్యాయస్థానం ఆ నీటిని చెరువుల్లో, జలవనరుల్లో కలపొద్దని ఆదేశించడంతో.. నీటిని ఏం చేయాలో తెలియక అధికారులు అయోమయంలోపడ్డారు. తమ ముందు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని బల్దియా తెలిపింది. కోనేరుల్లోని నీటిని ట్యాంకర్లతో మురుగునీటి శుద్ధి కేంద్రాలకు తరలించడం లేదా మురుగునీటి శుద్ధి కేంద్రాలకు కలిసే నాలాల్లో వదలడం అని అధికారులు చెబుతున్నారు.
సాగర్‌ ఒడ్డునా అదే పరిస్థితి..:  సాగర్‌లోని వ్యర్థాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. గుత్తేదారులకు కాంట్రాక్టు అప్పగించామని అధికారులు చెబుతున్నారు. కానీ ఏజెన్సీ సిబ్బంది విగ్రహాలను పూర్తిగా తీయట్లేదు. ఇనుప కడ్డీల వరకే బయటకు తీస్తున్నారు. పీఓపీ(ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌) ఫలకలను నీటిలోనే విసిరేస్తున్నారు. అలా చేయొద్దని, పూర్తిగా బయటకు తీసి ట్రక్కుల్లో తరలించాలని న్యాయస్థానం ఆదేశాల సారాంశం. అధికారులు మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోవట్లేదన్న విమర్శలొస్తున్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని