దొంగ అరెస్టు.. 13 తులాల బంగారం స్వాధీనం
eenadu telugu news
Published : 24/10/2021 04:29 IST

దొంగ అరెస్టు.. 13 తులాల బంగారం స్వాధీనం

నిందితుడి అరెస్టు చూపూతున్న ఏసీపీ శ్రీనివాసరావు

కరీంనగర్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: జల్సాలకు అలవాటు పడి తల్లిదండ్రులు కొనిచ్చిన ద్విచక్రవాహనాన్ని కుదువపెట్టి, దాన్ని విడిపించుకోవడానికి కన్నపు నేరాలకు పాల్పడి చివరకు పోలీసులకు చిక్కాడు ఒక దొంగ. అతని వద్ద 13 తులాల బంగారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ తుల శ్రీనివాసరావు కథనం ప్రకారం.. చొప్పదండి మండలం కాట్నపల్లికి చెందిన పిట్టల రాఖీ అలియాస్‌ రాకేష్‌(22) సుతారి పని చేస్తూ తండ్రికి తోడుగా ఉండేవాడు. జల్సాలకు అలవాటు పడి తండ్రి కొనిచ్చిన ద్విచక్రవాహనాన్ని తనఖా పెట్టాడు. దాన్ని విడిపించుకోవడానికి దొంగతనం చేయాలని నిర్ణయించుకొని ఈ నెల 8న కోర్టు భవనం వెనుక వైపు ఉన్న పాశం మునిరాజ్ ఇంట్లో దొంగతనానికి పాల్పడి 11 తులాల బంగారు ఆభరణాలు అహరించుకపోయి ఇంట్లో దాచిపెట్టాడు. మళ్లీ 15వ తేదీన కరీంనగర్‌లోని రామచంద్రపురి కాలనీలోని ఈసంపల్లి రాజేంద్రప్రసాద్‌ ఇంట్లో చోరీ చేసి 2.414 తులాల బంగారు ఉంగారాలు, నగదును అపహరించాడు. రెండో ఠాణా పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు శనివారం ఉదయం కోర్టుచౌరస్తాలో ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మీబాబు, ఎస్సై మహేష్‌లు రాఖీని పట్టుకున్నారు. అతన్ని విచారించి రూ.3.70 లక్షల విలువగల 13.414 తులాల బంగారు ఆభరణాలు, రూ.53 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని