జాతీయ స్థాయి సైక్లింగ్‌ పోటీలకు ఎంపిక
eenadu telugu news
Published : 25/10/2021 03:20 IST

జాతీయ స్థాయి సైక్లింగ్‌ పోటీలకు ఎంపిక

హర్షితను అభినందిస్తున్న ఏసీపీ సతీశ్‌

హుస్నాబాద్‌, న్యూస్‌టుడే: హుస్నాబాద్‌ పట్టణానికి చెందిన కొయ్యడ హర్షిత ఇటీవల తెలంగాణ సైక్లింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో  జరిగిన పోటీల్లో ప్రతిభ చాటి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈమె ప్రస్తుతం సిద్దిపేటలోని కస్తూర్బా విద్యాలయంలో ఎనిమిదో తరగతి చదువుతున్నారు. సైక్లింగ్‌తో పాటు కరాటేలో శిక్షకుడు కంటె రాజు  వద్ద తర్ఫీదు పొందుతున్నారు. ఈ మేరకు ఆదివారం స్థానిక ఏసీపీ వాసాల్‌ సతీష్‌.. హర్షితను అభినందించారు. జాతీయ స్థాయి పోటీల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని