ధ్యానంతో దైవ మార్గం సుగమం
eenadu telugu news
Published : 22/09/2021 02:40 IST

ధ్యానంతో దైవ మార్గం సుగమం

సూర్యాపేటలో మాట్లాడుతున్న గురువు సుభాష్‌ పత్రిజీ, తదితరులు

సూర్యాపేట సాంస్కృతికం, న్యూస్‌టుడే: ధ్యానంతో దైవత్వాన్ని పొందే మార్గం సులభతరం అవుతుందని పిరమిడ్‌ వ్యవస్థాపకుడు బ్రహ్మర్షి సుభాష్‌ పత్రిజీ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డ శివసాయి పిరమిడ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత ధ్యాన శిక్షణ శిబిరాన్ని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యోగా శాస్త్ర పితమహుడు పతంజలి మహర్షి చెప్పినట్లుగా ప్రతి ఒక్కరూ ద్యాన దీక్షను చేపట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం సూర్యాపేట పిరమిడ్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌ రాధా కృష్ణ జన్మదిన వేడుకలకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్‌ ట్రస్ట్‌ సభ్యులు, సత్యనారాయణ, విశ్వం, దారం శ్రీనివాస్‌, వాసవి క్లబ్‌ అధ్యక్షుడు కలకోట లక్ష్మయ్య, వాసవీ క్లబ్‌ సభ్యులు, సాధకులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని