సర్పంచుల సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిక
eenadu telugu news
Published : 15/10/2021 04:19 IST

సర్పంచుల సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిక

నూతనంగా ఎన్నికైన జిల్లా పంచాయతీ సర్పంచుల

సంఘం కార్యవర్గ సభ్యులు వీరే...

ఒంగోలు గ్రామీణం: పంచాయతీ సర్పంచుల సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని స్థానిక మల్లయ్య లింగం భవన్‌లో గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా బెజవాడ శ్రీరామమూర్తి(దొడ్డవరప్పాడు), కార్యనిర్వాహక అధ్యక్షురాలిగా తాటిపర్తి వనజ(సింగరాయకొండ), కన్వీనర్‌గా రాచగర్ల వెంకటరావు(మల్లవరప్పాడు), ప్రధాన కార్యదర్శిగా పగడాల రమేష్‌(రాచర్ల), కార్యదర్శిగా అయ్యపరెడ్డి(కూకట్లపల్లి) ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా పి.రామాంజిరెడ్డి, విపిన్‌బాబు, ఇంద్రసేనారెడ్డి, పున్నారావు, సహాయ కార్యదర్శులుగా పి.సుబ్బరాజు, ఎం.సునీతాబాయి, పి.అంజిరెడ్డి, ఎన్‌.నాగార్జునరెడ్డి, కోశాధికారిగా ఎన్‌.ప్రదీప్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తొలుత పంచాయతీ సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వీరభద్రాచారి అధ్యక్షతన సాగిన సమావేశంలో సర్పంచులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని