నా దృష్టికి తీసుకురండి
logo
Published : 18/06/2021 03:52 IST

నా దృష్టికి తీసుకురండి

సింహాచలం (అడివివరం), న్యూస్‌టుడే: అప్పన్న స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు త్వరలోనే అన్నప్రసాద వితరణ ప్రారంభించాలని దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌ గజపతిరాజు అధికారులను ఆదేశించారు. దేవస్థానానికి పలు సూచనలు చేస్తూ  ఆయన లేఖ పంపారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ భక్తులకు ఆహార పొట్లాలను అందించాలని సూచించారు. న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు ఈనెల 15వ తేదీ నుంచి తాను దేవస్థానం ఛైర్మన్‌గా తిరిగి కొనసాగుతున్నట్లు గుర్తు చేశారు. ఆ నేపథ్యంలో దేవస్థానంలో లీజులు, లైసెన్సులు, అభివృద్ధి పనులు, మేజర్‌ కొనుగోళ్లు, టెండర్లు వంటి ముఖ్య అంశాల్లో అజెండాలపై తన దృష్టికి తీసుకురాకుండా నిర్ణయాలు తీసుకోవద్దని ఈవోను ఆదేశించారు. ఇదే లేఖను రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్‌కు కూడా అశోక్‌ గజపతిరాజు పంపించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని