పార్టీ అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించాలి
eenadu telugu news
Updated : 31/07/2021 21:21 IST

పార్టీ అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించాలి

ఆనందపురం: ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ అభ్యున్నతి కొరకు నిరంతరం పనిచేయాలని భారతీయ జనతా పార్టీ జాతీయ జనరల్‌ సెక్రటరీ శివప్రకాష్‌ అన్నారు. శనివారం గంభీరం ఏపీఐఐసీలోని ఓ హోటల్‌లో ఉత్తరాంధ్ర భాజపా ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న శివప్రకాష్‌ మాట్లాడుతూ.. బూత్‌ స్థాయిలో పార్టీని బలోపేతం చేసిన నాడే పార్టీ తన లక్ష్యాన్ని సాధిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న ప్రజాసంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రధానంగా కొవిడ్‌ సంక్షోభంలో వచ్చే దీపావళి వరకు అందిస్తున్న ఉచిత రేషన్‌ కార్యక్రమాన్ని ప్రజలకు అందే విధంగా ప్రయత్నం చేయాలన్నారు. రాష్ర్ట భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ.. 21 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి గ్రామాల్లో వ్యాక్సినేషన్‌ అందేవిధంగా కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రానికి ఏయే నిధులను అందిస్తుందో సవివరంగా గ్రామాల్లో తెలిజేయడంతో పాటు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు సాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎంఎల్‌సీ పీవీఎన్‌ మాధవ్‌, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని