డిసెంబరులో ‘ఆంతే-2021 స్కాలర్‌షిప్‌’ పరీక్ష
eenadu telugu news
Updated : 24/09/2021 06:11 IST

డిసెంబరులో ‘ఆంతే-2021 స్కాలర్‌షిప్‌’ పరీక్ష


ఆకాశ్‌ ఇనిస్టిట్యూట్‌ నేషనల్‌ స్కాలర్‌షిన్‌-2021 ప్రచారపత్రం విడుదల చేస్తున్న ప్రతినిధులు

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ చదివే విద్యార్థుల కోసం ‘ఆకాశ్‌’ నిర్వహిస్తున్న జాతీయ స్కాలర్‌షిప్‌ పరీక్ష డిసెంబరు 4 నుంచి 12 మధ్య జరుగుతుందని ఆకాశ్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆకాశ్‌ చౌదరి తెలిపారు. పరీక్షకు సంబంధించిన ప్రచారపత్రాన్ని ఇనిస్టిట్యూట్‌ సిబ్బంది ఆవిష్కరించారు. డాక్టర్లు, ఇంజినీర్లు కావాలనుకునే విద్యార్థులు నీట్‌, ఐఐటీ-జేఈఈ కోచింగ్‌ పొందేందుకు పరీక్ష సన్నద్ధతకు ఆకాశ్‌ టాలెంట్‌ హంట్‌ ఎగ్జామ్‌ -2021 (ఆంతే-2021)లో ప్రతిభ చూపి 100శాతం స్కాలర్‌షిప్‌ పొందవచ్చని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ రెండు విధానాల్లో దేశ వ్యాప్తంగా 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ కోసం మూడు రోజుల ముందు వరకు, ఆఫ్‌లైన్‌లో పరీక్ష తేదీకి ఏడు రోజుల ముందు వరకు పేర్లు నమోదు చేసుకోవచ్చని, పరీక్ష రుసుము రూ.99లుగా పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని