Published : 21/04/2021 02:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టోకెన్‌ ఆధారంగానే ధాన్యం కొనుగోళ్లు


వివరిస్తున్న కలెక్టర్‌ నిఖిల

జనగామ అర్బన్‌, న్యూస్‌టుడే: కరోనా దృష్ట్యా రైతులు పెద్ద ఎత్తున ఒకేసారి కొనుగోలు కేంద్రాలకు రాకుండా వ్యవసాయ విస్తరణ అధికారులచే ముందస్తుగా టోకెన్లను జారీ చేసి ధాన్యం కొనుగోలు ప్రక్రియను చేపట్టినట్లు జిల్లా కలెక్టర్‌ నిఖిల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతు ఏ రోజు ఏ సమయంలో ఏ కేంద్రానికి ధాన్యం తేవాలో పూర్తి వివరాలతోపాటు కేంద్రాల బాధ్యుల వివరాలు పొందుపరచి పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. ప్రభుత్వం సాగునీరు, విద్యుత్తు సదుపాయాల కల్పనతో జిల్లాలో వరిసాగు విస్తీర్ణం పెరిగిందని, యాసంగిలో జిల్లాలో 1.68 హెక్టార్లలో వరి సాగైందని, ఇందులో 2.86 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. కరోనా ఉద్ధృతిని దృష్టిలో పెట్టుకుని దిగుబడి అంచనాల మేరకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎక్కడి వారు అక్కడే తమ పంటను అమ్ముకునే వెసులబాటుకుగాను జిల్లా వ్యాప్తంగా మొత్తం 193 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి సంబంధిత అధికారులను నియమించామన్నారు. నియోజకవర్గాల వారీగా పౌరసరఫరాల డీటీలను, డివిజన్ల వారీగా ఆర్డీవోలను పర్యవేక్షణకు నియమించామని తెలిపారు. కేంద్రాల పర్యవేక్షణకు జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్‌ ఛైర్మన్‌గా జిల్లా అధికారులతో ధాన్య సేకరణ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. రికార్డుల నిర్వహణ, కొనుగోలు ప్రక్రియను ఆన్‌లైన్‌లో నమోదుకు ట్యాబ్‌ వాడడంపై ఈనెల 16, 17 తేదీల్లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. జిల్లాలో ధాన్యం కొనుగోలులో ఏమైనా ఇబ్బందులు, ఫిర్యాదులు ఉన్నట్లయితే 63039 28718 నెంబర్‌ను సంప్రదించాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలను పాటించాలని సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని