Published : 03/03/2021 05:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మిగిలిన పంచాయతీలకూ ఎన్నికలు 

 

ఏలూరు వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: జిల్లాలో ఖాళీగా ఉన్న సర్పంచి, వార్డు సభ్యుల స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు మంగళవారం ప్రకటన వెలువడింది. జిల్లాలో తొలుత 895 పంచాయతీలకు ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్‌ జారీ చేయగా.. పలు కారణాలతో పోలవరం మండలం ఎల్‌ఎన్‌డీ పేట, ఇటుకలకోట 7వ వార్డు, కామవరపుకోట మండలం తడిచర్లలో మొదటి వార్డు, భీమవరం మండలం ఎల్‌వీఎన్‌పురం మొదటి వార్డు, నరసాపురం పాత గ్రామం 5వ వార్డు, పాలకోడేరు మండలం కొండేపూడి 4వ వార్డు, పెనుమంట్ర మండలం ఓడూరు 4వ వార్డు, నిడదవోలు మండలం ఉనకరిమిల్లి 8వ వార్డు, ఏలూరు మండలం కలకర్రు 8వ వార్డు, దెందులూరు మండలం పెరుగ్గూడెం 9వ వార్డు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 4 నుంచి నామినేషన్లు, 10న ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా వివరాలను అధికారులు ప్రకటించనున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని