జాతీయ స్థాయిలో క్రీడాకారుల ప్రతిభ
eenadu telugu news
Published : 24/10/2021 05:07 IST

జాతీయ స్థాయిలో క్రీడాకారుల ప్రతిభ


ట్రోఫీని అందుకుంటున్న క్రీడాకారులు

ఆకివీడు, న్యూస్‌టుడే: ఆకివీడులోని అయిభీమవరం రోడ్డులో ఉన్న ఏఎస్‌ఎస్‌ రాజు స్పోర్ట్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో విద్యార్థులు వివిధ క్రీడాంశాల్లో శిక్షణ పొందుతూ రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులుగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఈ నెల 21, 22, 23 తేదీల్లో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన 3వ నేషనల్‌ గేమ్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌ 2021-22 పోటీల్లో అకాడమీ ఆధ్వర్యంలో పాల్గొన్న క్రీడాకారులు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో విజేతలుగా నిలిచారని శిక్షకుడు వల్లభూని నాగరాజు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా విజేతలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

బాల బాలికల అథ్లెటిక్స్‌.. ఆంధ్రప్రదేశ్‌ జట్టు: ● 400 మీటర్ల అండర్‌- 17 పరుగు పందెంలో బుంగా సంధ్య మొదటి స్థానంలో నిలిచారు.

400 మీటర్ల అండర్‌- 19 పరుగు పందెంలో యేలేటి మనీషా తృతీయ స్థానంలో నిలిచారు.

వాలీబాల్‌ విజేతల వివరాలు ● వి.రవితేజ, సీహెచ్‌ ప్రదీప్‌, సీహెచ్‌ విశాల్‌, కె.నాని, జి.ఆకాష్‌, ఎ.సాయి, వి.పార్థసారధి, పి.అశ్వంత్‌ విజేతలుగా నిలిచారు. వీరికి శనివారం సాయంత్రం నిర్వహించిన క్రీడా పోటీల ముగింపు వేడుకల్లో షీల్డ్‌, బంగారు పతకం, ధ్రువపత్రం అందజేశారని నాగరాజు చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని