close

ఆదివారం, ఆగస్టు 25, 2019

ప్రధానాంశాలు

వామపక్షాలు ఐక్యంగా పోరాడాలి

బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: వామపక్షాలు ఐక్యంగా సామాజిక పోరాటాలు చేపట్టాలని ప్రొ.కంచ ఐలయ్య పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని సుందరయ్య కళానిలయంలో ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మార్క్సిజం-అంబేడ్కర్‌ ఆలోచనా విధానం, సామాజిక న్యాయం-ప్రస్తుత కర్తవ్యం అనే అంశంపై చర్చాగోష్టి నిర్వహించారు. ప్రధాన వక్తగా హాజరైన కంచ ఐలయ్య మాట్లాడుతూ సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి దళిత వ్యక్తిని, ఎంసీపీఐ (యూ) జాతీయ ప్రధాన కార్యదర్శిగా మైనార్టీ వ్యక్తిని నియమించడం శుభపరిణామన్నారు. ఈ విషయంలో సీపీఎం ఆ దిశగా అడుగులు వేయకపోవడం బాధాకరమన్నారు. బీఎల్‌ఎఫ్‌ పక్షాన ఎంసీపీఐ(యూ), సీపీఐతో కలిసి పని చేస్తామని, అన్ని పురపాలిక, నగర పాలిక ఎన్నికల్లో పోటీ చేసి బహుజనులు రాజ్యాధికారం సాధించే దిశగా ముందుకు సాగుతామన్నారు. బీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర ఛైర్మన్‌ నల్లా సూర్యప్రకాష్‌రావు మాట్లాడుతూ తెలంగాణలో సీపీఐ ఎర్ర కాంగ్రెస్‌గా మారిందని ఆరోపించారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తరచూ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌, తెజస రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాంతో కలిసి ఉద్యమం చేస్తున్నారని, కింది కులాలతో కలిసి పనిచేయకపోవడం విచారకరమన్నారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రకుమార్‌ మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం బహుజనులకు రాజకీయ రిజర్వేషన్లు, ఆర్థిక సమానత్వం కల్పించాలన్నారు. హక్కులను పోరాడి సాధించుకోవాలన్నారు. సినీ గేయ రచయిత జయరాజు మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడాలేని కుల సమస్య మన దేశంలోనే ఉందన్నారు. అగ్రవర్ణాల పాలకులు కింది కులాలను రాజకీయంగా  అణచివేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, ఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి ఎండీ గౌస్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాండ్రకుమార్‌, బీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ మద్దికాయల అశోక్‌ మాట్లాడారు. రానున్న పురపాలిక, నగర పాలిక ఎన్నికల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తీర్మానించారు. కాలువ మల్లయ్య రచించిన మార్క్స్‌-అంబేడ్కర్‌ భారతదేశంలో ఆర్థిక సామాజిక విప్లవాలు అనే పుస్తకాన్ని ఆచార్య జయధీర్‌ తిరుమల్‌రావు ఆవిష్కరించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.