close

ఆదివారం, జనవరి 26, 2020

ప్రధానాంశాలు

పరిశ్రమల స్థాపనకు సత్వర అనుమతులు

కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి

సమీక్ష నిర్వహిస్తున్న కలెక్టర్‌

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలో పరిశ్రమల స్థాపనకు సత్వరమే అనుమతులు జారీ చేయాలని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో కలెక్టర్‌ అధ్యక్షతన పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. పరిశ్రమల స్థాపనకు ఏకగావాక్ష విధానంలో అర్హులకు అనుమతులు జారీ చేయాలని ఆదేశించారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు తొమ్మిది దరఖాస్తులు వచ్చాయని, వీటిలో నాలుగింటికి అనుమతులు మంజూరు చేశామని, అయిదు పరిశీలనలో ఉన్నాయని జిల్లా పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజరు శ్రీనివాసరావు తెలిపారు. కొత్తగా స్థాపించే పరిశ్రమల్లో స్థానిక యువతకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ సమావేశంలో కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజినీరు రామారావునాయుడు, డీపీవో నాగేశ్వర్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆక్వా చెరువుల క్రమబద్ధీకరణకు చర్యలు..

జిల్లాలో ఆక్వా చెరువుల క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మంచినీటి చెరువుల్లో చేపల పెంపకానికి సంబంధించి 272 దరఖాస్తులను పరిశీలించి, 929.27 ఎకరాలను క్రమబద్ధీకరణకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. ఉప్పునీటి చెరువుల్లో రొయ్యల పెంపకానికి సంబంధించి రిజిస్ట్రేషన్‌, రెన్యువల్‌కు 168 దరఖాస్తులు పరిశీలించి, 30 ఎకరాలు క్రమబద్ధీకరణకు ఆమోదించామన్నారు. ఈ సమావేశంలో జేసీ-2 రాజకుమారి, డీఆర్వో సత్తిబాబు, మత్స్యశాఖ జేడీ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

నమూనా లే-అవుట్‌లు సిద్ధం చేయాలి

పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి నమూనా లే-అవుట్‌లు సిద్ధం చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. నమూనా లే-అవుట్‌తోపాటు బహుళ అంతస్తుల భవనాలు నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో గుడా వైస్‌ ఛైర్మన్‌ అమరేంద్రకుమార్‌, జేసీ-2 రాజకుమారి, గృహనిర్మాణ సంస్థ పీడీ వీరేశ్వరప్రసాద్‌, డీపీవో నాగేశ్వర్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.