close

సోమవారం, మార్చి 30, 2020

ప్రధానాంశాలు

సృజన వికసించే.. పరిశోధన ఆలోచింపజేసే..

బాల మేధావుల ఆలోచనలు అద్భుతం
చిట్టిబుర్రలో వినూత్న ఆవిష్కరణలు
దక్షిత భారతదేశ ప్రదర్శనలో ఉమ్మడి జిల్లా విద్యార్థుల ప్రతిభ
పెద్దపల్లి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే

చిన్నారుల్లో సృజన వికాసం వెల్లివిరిసింది. చిట్టిబుర్రలో మెరిసిన ఆలోచనలు అబ్బురపరుస్తున్నాయి. తార్కిక్‌ ఆలోచనశక్తితో శాస్త్రీయ దృక్పథం వైపు అడుగులు వేస్తున్నారు. ఉపాధ్యాయుల(గైడ్‌ టీచర్ల) ప్రోత్సాహంతో పరిశోధన రంగాల్లో అదరగొడుతున్నారు. జిల్లాస్థాయి వైజ్ఞాన సదస్సులో నూతన ఆవిష్కరణలు రూపొందించి రాష్ట్రస్థాయిలో ప్రతిభచాటారు. ఇటీవల దక్షిణ భారతదేశంలో నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనలో పలు రాష్ట్రాల నుంచి 50 మంది విద్యార్థులు, ఉపాధ్యాయలు పాల్గొన్నారు. వీరిలో 13 మంది ఉమ్మడి జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల పరిశోధనలు ఆలోచింపజేశాయి. వారి ఆవిష్కరణలపై స్ఫూర్తిదాయక కథనం.

ఆకర్షణీయం..అద్భుత నగరం
విద్యార్థి పేరు: సైండ్ల వినీల
పాఠశాల: వాణి సెకండరీ పాఠశాల, సెంటినరీకాలనీ
నమూనా: సూర్యనగర్‌ ఎస్మార్ట్‌ సిటీ
ప్రయోగ ఫలం: పెద్ద పెద్ద నగరాల్లో జనజీవనాన్ని ప్రభావం చేసే అంశాలు ట్రాఫిక్‌, ఇంటర్నెట్‌ వ్యవస్థ, విపత్తు నివారణ, గ్రీన్‌ ఎనర్జీ, విద్యుత్తు సరఫరా, చెత్త సేకరణ... వీటిల్లో ఈ విధానం అనుసరించడంతో పట్టణవాసుల జీవనం సాఫీగా సాగుతుంది.

అదిరెన్‌ చారిత్రక కట్టడాల సొగసులు
విద్యార్థి పేరు: రామ్‌చరణ్‌
పాఠశాల: అల్ఫోర్స్‌ ఇ-టెక్నో పాఠశాల, కరీంనగర్‌
నమూనా: స్వర్ణ నిష్పత్తి (గోల్డన్‌ రేషియో)
ప్రయోగ ఫలం: గణితం అంటే గబారా పడుతుంటారు. అలాంటి గణితంలో సులువుగా నిష్పత్తి ఆధారంగా చారిత్రక కట్టడాల నిర్మాణంలో ఈ విధానాన్ని వినియోగించవచ్చు. పెయింటింగ్‌లోనూ దీనిని ఉపయోగించుకోవచ్చు. ఆకర్షణీయ రీతిలో రూపొందించుకునే వీలుంది.

కల్తీ.. ఇట్టే పట్టేస్తుంది
విద్యార్థి పేరు: శనిగరపు ఉష
పాఠశాల పేరు: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, చొప్పదండి
నమూనా: ఆహార పదార్థాలలో కల్తీ గుర్తించడం
ప్రయోగ ఫలం: నిత్య జీవితంలో అంతా కల్తీమయమవుతోంది. మనం తినే ఆహార పదార్థాలైన పసుపు, కారం, నెయ్యి, తేనే, రవ్వ, మైదాలో కల్తీ ఆందోళన కలిగిస్తోంది. అయోడిన్‌, నీటితో పరీక్షిస్తే నిత్యావసర సరకుల్లో కల్తీ బయటపడుతుంది.

కొబ్బరి బొండం..తీసేన్‌ రంధ్రం
విద్యార్థి పేరు: బొప్పెన రాహుల్‌
పాఠశాల: జిల్లా పరిషత్‌, ఇల్లంతకుంట
నమూనా: కొబ్బరి పీచు తీసే యంత్రం
ప్రయోగ ఫలం: మార్కెట్‌లో లభ్యమయ్యే యంత్రాల్లో ఉండే సమస్యలను దీనితో అధిగమించవచ్చు. కొబ్బరి పీచును సులువుగా, తక్కువ సమయంలో ఎవరైనా తీయవచ్చు. కొబ్బరి బొండలోని కొబ్బరి నీరు తాగేందుకు వీలుగా ఎలాంటి ప్రమాదం లేకుండా రంధ్రం చేసేందుకు ఉపయోగించవచ్చు.

రైతుకు రక్షణ కవచం
విద్యార్థి పేరు: కండ్లె అభినయ
పాఠశాల: జడ్పీహెచ్‌ మల్లన్నపేట(గొల్లపల్లి మండలం)
నమూనా: రైతు గొడుగు(ఫార్మర్స్‌ అంబ్రెల్లా)
ప్రయోగ ఫలం: రైతులు రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నారు. ఎండకు ఎండుతూ..వానకు తడుస్తూ జీవిస్తున్నారు. రైతు ఆరోగ్యంగా ఉంటే దేశం సౌభాగ్యంగా విలసిల్లనుంది. రైతు సంక్షేమం కోసం జనపనారతో చేసిన గొడుగు వర్షం, ఎండకు రక్షణ కవచంగా ఉంటుంది. ఏ కాలంలోనైనా దీనిని బయటికి తీసుకెళ్లవచ్చు.

‘మత్తు’ వదలాల్సిందే
విద్యార్థి పేరు: శృతి
పాఠశాల: జడ్పీహెచ్‌ జగిత్యాల(పాత)
నమూనా: ఆటోమెటిక్‌ ఇంజిన్‌ లుకింగ్‌ సిస్టమ్‌ ఫర్‌ డ్రంక్‌ అండ్‌ డ్రైవర్స్‌
ప్రయోగ ఫలం: మద్యం సేవించి వాహనాలు నడుతుండటంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అలాంటి వారిని పోలీసులు బ్రీత్‌ ఎనలైజర్‌ విధానంతో పరీక్షిస్తున్నారు. అయినా కొందరు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా మద్యం తీసుకొని వాహనం నడపాలని చూస్తే ఈ విధానం ముందుగానే పసిగట్టడంతో బండి స్టార్ట్‌ కాదు. ఇది రహదారి ప్రమాదాలు నివారించే సాధనంగా ఉపయోగపడనుంది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.