close

గురువారం, అక్టోబర్ 17, 2019

తాజా వార్తలు

నేటి నుంచి పశువైద్య విజ్ఞాన ప్రదర్శన

అందరూ ఆహ్వానితులే.. ప్రవేశం ఉచితం

ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు

తిరుపతి (పశువైద్య విశ్వవిద్యాలయం), న్యూస్‌టుడే: పశువైద్యరంగానికి సంబంధించి ఎన్నో ఆవిష్కరణలు, అరుదైన పరిశోధనలు, జాతీయ స్థాయి ప్రత్యేకతలతో కొలువుదీరనుంది పశువైద్య విజ్ఞాన ప్రదర్శన. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని పశువైద్య కళాశాలలోని ఆడిటోరియంలో శుక్రవారం ఉదయం 10గంటలకు ఈ ప్రదర్శనను ప్రముఖులు ప్రారంభించనున్నారు. వర్సిటీ చరిత్రలో తొలిసారిగా ఈ ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా నిర్వహించనున్నారు. సామాన్యులకు పశువైద్య అంశాలపై అవగాహన కల్పించాలని అధికారులు సంకల్పించారు. పశువైద్య కళాశాలలు, ప్రయోగశాలలు, ప్రదర్శనశాలలను, ఇతర పశు, మత్య్స సంబంధమైన ప్రదర్శనలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే జిల్లాలోని పాఠశాలల విద్యార్థులకు, జిల్లాలోని ఆదర్శ పాడి, కోళ్లు, గొర్రెలు, మేకల రైతులు, ఔత్సాహికులకు సమాచారం ఇచ్చారు. ఈ ప్రదర్శనలో పాల్గొనేందుకు ఎలాంటి ఆంక్షలు లేవని, ప్రవేశ రుసుం లేకుండా ఉచిత ప్రవేశాన్ని కల్పించినట్లు విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్‌ వై.హరిబాబు తెలిపారు. ప్రారంభోత్సవ సమావేశానికి తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్‌, ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి, తుడా అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, జిల్లా కలెక్టర్‌ భరత్‌గుప్తా, తిరుపతి అర్బన్‌ ఎస్పీ అన్బురాజన్‌ ముఖ్యఅతిథులుగా హాజరవుతారని ఆయన తెలిపారు. ప్రదర్శనలో ముఖ్యంగా సాహివాల్‌ జాతి అవులు, నెల్లూరు జాతి గొర్రెలు, గుర్రాలు, వివిధ కోళ్ల జాతులు, సీమ పందులను ప్రదర్శించనున్నారు. కళాశాలలోని ఆధునిక పశుపోషణ ప్రయోగశాల, కృత్రిమ గర్భోత్పత్తి ప్రయోగశాల, రాష్ట్రస్థాయి పశువ్యాధి నిర్ధరణ కేంద్రం, పశు చికిత్స విభాగ సముదాయాల సందర్శన, అక్కడ జరుగుతున్న పరిశోధనలు, అందుతున్న సేవల గురించి అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వర్సిటీ ఉత్పత్తి చేస్తున్న పాల పదార్థాలు, చేప ఉత్పత్తుల ప్రదర్శనతో పాటు అమ్మకాలు జరిపేందుకు ప్రత్యేక కౌంటర్లు సిద్ధం చేశారు. స్థానికుల కోసం ప్రతి రోజూ సాయంత్రం 4 గంటలకు శునక విన్యాసాల ప్రదర్శన, ఎన్‌సీసీ క్యాడెట్ల అశ్వవిన్యాసాల ప్రదర్శన ఉంటుంది.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.