close

బుధవారం, అక్టోబర్ 23, 2019

తాజా వార్తలు

కదిలిన విద్యుత్తు యంత్రాంగం

30 రోజుల ప్రణాళికలో సమస్యల పరిష్కారం
వ్యవసాయ సమస్యలపై స్పందించని వైనం

జగిత్యాల గ్రామీణం, న్యూస్‌టుడే: ఎన్నో ఏళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో పరిష్కారానికి నోచని విద్యుత్తు సమస్యలకు అధికారులు ఎట్టకేలకు కదిలారు.. ఇన్నాళ్లు కార్యాలయాల చుట్టూ తిరిగినా పట్టించుకోని అధికార యంత్రాంగం ముఖ్య మంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో.. 30 రోజుల ప్రణాళికలో సమస్యలను గుర్తించి ఊరురా వారే బాగు చేస్తున్నారు. జిల్లాలో ఈ నెల 6 నుంచి 30 రోజుల ప్రణాళిక ప్రారంభం కాగా గత పదిరోజులుగా విద్యుత్తు మరమ్మతు పనులు చేపడుతున్నారు. జిల్లాలో 942 వంగిన స్తంభాలు గుర్తించారు. ఇందులో 172 స్తంభాలను సరి చేశారు. వదులుగా ఉన్న వైర్లను 1524 ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు 454 వరకు సరి చేశారు. స్తంభానికి స్తంభానికి మధ్య దూరం ఉన్న చోట 4462 నూతన స్తంభాలు అవసరం ఉన్నట్లు గుర్తించగా 726 కొత్త స్తంభాలను వేశారు. ప్రమాదకరంగా ఉన్న చోట 2992 అవసరం ఉండగా వాటి స్థానంలో కొత్తవి 439 మార్చారు. 479 కిలోమీటర్ల దూరం గల ఏబీ కేబుల్‌ దెబ్బతిని ఉన్నట్లు సర్వేలో గుర్తించిన అధికారులు ఇప్పటి వరకు 39 కిలోమీటర్లు కొత్త కేబుల్‌ను మార్చారు. ట్రాన్స్‌ఫార్మర్ల దగ్గర ఎర్త్‌ వైర్లు సరీగా లేక చాలా ప్రమాదాలు జరిగాయి. జిల్లాలో 1248 ట్రాన్స్‌ఫార్మర్లు గుర్తించగా 43 ట్రాన్స్‌ఫార్మర్లను సరిచేశారు. వీధి దీపాల కోసం కొత్తగా లైన్లు వేసేందుకు 93 ప్రాంతాలను గుర్తించగా అందులో 43 వరకూ కొత్తగా లైన్లను వేశారు. రెండు వైర్లు ఉండి మూడు వైర్లు వేసేందుకు 218 కిలోమీటర్ల దూరాన్ని గుర్తించగా ఇప్పటి వరకు 55 కిలోమీటర్ల దూరాన్ని మూడు వైర్లుగా మార్చారు. అయిదు వైర్లు ఉండే ప్రాంతాలను 1336 కిలోమీటర్ల దూరం కావాలని గుర్తించిన విద్యుత్తు అధికారులు ఇప్పటి వరకు 3.42 కిలోమీటర్ల దూరం మార్చారు. జిల్లాలో 369 గ్రామాల్లో సమస్యలను గుర్తించిన అధికారులు ఇప్పటి వరకు 116 గ్రామాల్లో పనులు సాగుతున్నాయి. మిగిలిన గ్రామాల్లో పనులు చేపట్టాల్సి ఉంది. ఈ నెల 6 వరకు పూర్తి స్థాయిలో పనులు చేస్తామని ఎస్‌ఈ వేణుమాధవ్‌ తెలిపారు. ఇప్పటి వరకు 40 శాతం పనులు పూర్తి చేశామని, మిగిలిన వాటిని త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు.

గ్రామాల్లో సరే.. వ్యవసాయ సమస్యలు
30 రోజుల ప్రణాళికలో జిల్లాలో అన్ని గ్రామాల్లో ఎట్టకేలకు విద్యుత్తు సమస్యలు పరిష్కారం అవుతుండగా వ్యవసాయ పొలాల్లో ఉన్న విద్యుత్తు సమస్యలపై పరిస్థితి ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. తమ సమస్యలను కూడా గుర్తించి బాగు చేయాలని కోరుతున్నారు. కేవలం గ్రామాల్లో బాగు చేసి వ్యవసాయ విద్యుత్తు సమస్యలను వదిలి వేయడం సరికాదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్తు ప్రమాదాలు జరుగుతున్నాయని, వైర్లు వదులుగా ఉన్నాయని, ట్రాన్స్‌ఫార్మర్లు ప్రమాదకరంగా ఉన్నాయని, కొన్ని విద్యుత్తు స్తంభాలు పడిపోయే విధంగా ఉన్నాయని రైతులు తెలిపారు. ప్రభుత్వం రైతు సమస్యలపైనా దృష్టి సారించాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.