close

ఆంధ్రప్రదేశ్‌-లోక్‌సభా స్థానాలు

కడప లోక్‌సభ నియోజకవర్గ సమాచారం 

కడప లోక్‌సభ నియోజకవర్గం 1952లో ఆవిర్భవించింది. జనరల్‌ కేటగిరిలో ఉన్న ఈ నియోజకవర్గంలోకి కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు బద్వేలు శాసనసభా నియోజకవర్గాలు వస్తాయి. 
1952లో జరిగిన తొలి ఎన్నికల్లో కమ్యూనిస్ట్‌పార్టీ విజయం సాధించింది. ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్ట్‌ పార్టీ నాలుగు సార్లు, కాంగ్రెస్‌ పార్టీ పదిసార్లు, తెలుగుదేశం పార్టీ ఒకసారి విజయం సాధించగా, రెండుసార్లు వైకాపా జయకేతనం ఎగురవేసింది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీనివాసరెడ్డిపై వైఎస్‌ అవినాష్‌రెడ్డి 1,90,265 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 

గెలుపొందిన అభ్యర్థులు వీరే!
* 1952 ఎద్దుల ఈశ్వర్‌రెడ్డి(సీపీఐ) 
* 1957 వీఆర్ రెడ్డి (కాంగ్రెస్) 
* 1962 ఎ.ఈశ్వర్‌రెడ్డి (సీపీఐ) 
* 1967 ఈశ్వర్‌రెడ్డి (సీపీఐ) 
* 1971 ఎ.ఈశ్వర్‌రెడ్డి (సీపీఐ) 
* 1977 కందుల ఓబుల్‌రెడ్డి (కాంగ్రెస్) 
* 1980 ఓబుల్‌రెడ్డి (కాంగ్రెస్) 
* 1984 డీఎన్ రెడ్డి (తెదేపా) 
* 1989 వైఎస్ఆర్ (కాంగ్రెస్) 
* 1991 వైఎస్ఆర్ (కాంగ్రెస్) 
* 1996 వైఎస్ఆర్ (కాంగ్రెస్) 
* 1998 వైఎస్ఆర్ (కాంగ్రెస్) 
* 1999 వైఎస్‌వివేకానందరెడ్డి(కాంగ్రెస్) 
* 2004 వైఎస్‌వివేకానందరెడ్డి(కాంగ్రెస్) 
* 2009 వైఎస్‌జగన్మోహన్‌రెడ్డి(కాంగ్రెస్) 
* 2011 వైఎస్ జగన్మోహన్‌రెడ్డి (వైకాపా)
* 2014 వైఎస్‌ అవినాష్‌రెడ్డి(వైకాపా)



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net