TS Lockdown: ఇప్పటివరకు 21 వేల కేసులు 

తాజా వార్తలు

Published : 20/05/2021 12:41 IST

TS Lockdown: ఇప్పటివరకు 21 వేల కేసులు 

సీపీ మ‌హేశ్ భ‌గ‌వ‌త్ వెల్ల‌డి

హైదరాబాద్‌: లాక్‌డౌన్ నిబంధ‌న‌లు పాటించని వారిపై చ‌ర్య‌లు తీసుకుంటున్నట్లు రాచ‌కొండ సీపీ మ‌హేశ్ భ‌గ‌వ‌త్ అన్నారు. ఇవాళ ఉద‌యం షీ బృందాల కోసం 16 ద్విచక్ర‌వాహ‌నాల‌ను ఆయ‌న‌ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఇప్ప‌టి వ‌ర‌కు నిబంధ‌న‌లు పాటించని వారిపై 21 వేల కేసులు న‌మోదు చేసిన‌ట్లు వివ‌రించారు. మాస్కులు ధ‌రించ‌కుండా తిర‌గేవారిపై 6 వేల కేసులు న‌మోద‌య్యాయ‌ని తెలిపారు. రెమ్‌డెసివిర్‌, ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల‌ను అధిక ధ‌ర‌ల‌కు విక్ర‌యిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌న్నారు. అన్ని చెక్‌పోస్టుల వ‌ద్ద విధులు నిర్వ‌ర్తించే అధికారులు, సిబ్బంది లాక్‌డౌన్ విజ‌య‌వంతానికి క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించిన‌ట్లు సీపీ స్ప‌ష్టం చేశారు.

మ‌రోవైపు డీజీపీ ఆదేశాల మేర‌కు పోలీసులు లాక్‌డౌన్‌ను క‌ఠినంగా అమ‌లు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో 330 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి త‌నిఖీలు చేస్తున్నారు. అన‌వ‌స‌రంగా రోడ్ల పైకి వ‌స్తున్న వాహ‌న‌దారుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. స‌రైన కార‌ణం లేకుండా వ‌స్తున్న వాహ‌నాల‌ను సీజ్ చేస్తున్నారు.

స‌జ్జ‌నార్ ప‌ర్య‌ట‌న‌

మియాపూర్ ప‌రిధిలో సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ ప‌ర్య‌టించారు. లాక్‌డౌన్ అమ‌లు తీరును ప‌ర్య‌వేక్షించారు. మియాపూర్ జె.పి.న‌గ‌ర్ మార్కెట్‌ను ప‌రిశీలించారు. చందాన‌గ‌ర్, తారాన‌గ‌ర్ మార్కెట్ల‌ను కూడా త‌నిఖీ చేశారు. చందాన‌గ‌ర్‌లోని రాజీవ్ గృహ‌క‌ల్ప కాల‌నీలో స‌జ్జ‌నార్ ప‌ర్య‌టించి లాక్‌డౌన్ అమ‌లును ప‌ర్య‌వేక్షించారు.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని