Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 21/09/2021 12:55 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు

1. చీకటి రాజకీయాలు ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసు: ఎంపీ భరత్‌

తనపై సొంత పార్టీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలపై వైకాపా ఎంపీ భరత్‌ వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఆయన రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడారు.‘‘ మా కుటుంబం గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నానని మాట్లాడుతున్నారు. చీకటి రాజకీయాలు ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసు. వి.వి.లక్ష్మీనారాయణతో నేను సెల్ఫీలు తీసుకున్నానని విమర్శించారు. నాపై అభియోగాలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. కాపు సమావేశంలో లక్ష్మీనారాయణను కలిశాను. నేను పార్లమెంట్‌లో చాలా బాగా మాట్లాడానని లక్ష్మీనారాయణ అన్నారు. నేను వెళ్లి సెల్ఫీ తీసుకోలేదు.. వీడియో దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది’’ అని భరత్‌ అన్నారు.

తెదేపాకు ఏడుగురు.. జనసేనకు నలుగురు.. ఎంపీపీ కోసం క్యాంపు రాజకీయం 
విజయవాడలో వాణిజ్య ఉత్సవ్‌ను ప్రారంభించిన జగన్‌

2. డబ్బులివ్వలేదని షర్మిల దీక్షాస్థలి వద్ద అడ్డాకూలీల ఆందోళన

మేడ్చల్‌ జిల్లా పీర్జాదిగూడలో అడ్డాకూలీలు ఆందోళనకు దిగారు. వైఎస్ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టనున్న దీక్షకు తమను తీసుకొచ్చి డబ్బు ఇవ్వట్లేదని అడ్డాకూలీలు నిరసన తెలిపారు. తమను తీసుకొచ్చిన వారు డబ్బు ఇవ్వట్లేదని దీక్షా స్థలి వద్దే ఆందోళన చేశారు. దీక్షలో కూర్చుంటే రూ.400 ఇస్తామని చెప్పి తీసుకొచ్చారని కూలీలు చెబుతున్నారు. 

3. కొప్పర్రులో రాళ్ల దాడి ఘటన.. పోలీసుల అదుపులో 15 మంది

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రులో జరిగిన ఘర్షలో ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసి 15 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పొన్నూరు గ్రామీణ సీఐ శ్రీనివాస్‌ తెలిపారు. నిన్న రాత్రి వినాయకుడి విగ్రహం నిమజ్జనంలో భాగంగా ఊరేగింపు నిర్వహిస్తుండగా ఓ పార్టీకి చెందిన వారు జెండాలు ఊపడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తినట్లు తెలిపారు. గొడవలో మూడు ద్విచక్రవాహనాలు దహనమైనట్లు చెప్పారు. ఇరు వర్గాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసులు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. 

4. రాజ్‌కుంద్రా ఫోన్‌లో 119 నీలి చిత్రాలు గుర్తించాం

అశ్లీల చిత్రాల కేసులో అరెస్టైన ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా గురించి ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు కొన్ని విషయాలు బయటపెట్టారు. రెండు నెలలపాటు పోలీసుల కస్టడీలో ఉన్న రాజ్‌కుంద్రాకు సోమవారం కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో రాజ్‌కుంద్రా కేసుపై క్రైమ్‌ బ్రాంచ్‌ అధికారులు స్పందించారు. విచారణలో భాగంగా రాజ్‌కుంద్రా ఫోన్‌, లాప్‌టాప్‌, హాట్‌డ్రైవ్‌ డిస్క్‌లను పరిశీలించామని.. వాటిల్లో మొత్తం 119 నీలిచిత్రాలు గుర్తించామని పోలీసులు తాజాగా వెల్లడించారు. ఆ వీడియోలన్నింటినీ కుంద్రా రూ.9 కోట్లకు బేరం పెట్టినట్లు తెలిపారు.

5. 22 లక్షల ఎకరాల భూస్వామి.. ‘జాన్ మెలోన్‌’

ప్రపంచంలో అత్యంత ధనవంతులు ఎవరంటే వెంటనే మనకు బిల్‌ గేట్స్‌, జెఫ్‌ బెజోస్‌, వారెన్‌ బఫెట్‌ వంటి వారు గుర్తొస్తారు. వీరంతా అగ్రరాజ్యం అమెరికాకు చెందినవారే. అయితే, వీరు సొంతంగా వ్యాపారాలు, షేర్లు, ఇతరత్రా పెట్టుబడులు పెట్టి అధికంగా ఆర్జిస్తుంటారు. కానీ, వీరికి ఎన్ని ఎకరాల భూమి ఉంటుందో తెలుసా? అలాగే వీరందరికంటే ఎక్కువ భూమి ఉన్న వ్యక్తి మరొకరున్నారు. ఆయన మీడియాలో కనిపించరు. ఆయనే ‘జాన్‌ మెలోన్‌’. అమెరికాలో అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల్లో ఆయనొకరు. 22 లక్షల ఎకరాల భూస్వామి.

6. తగ్గిన కేసులు.. పెరిగిన రికవరీలు..

కొద్ది రోజులుగా 30 వేలకుపైనే నమోదవుతోన్న కరోనా కొత్త కేసులు నిన్న కాస్త తగ్గాయి. 13.6 శాతం మేర క్షీణించి.. 26 వేలకు పడిపోయాయి. అలాగే 200కు పైగా మరణాలు సంభవించాయని మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటం, క్రియాశీల కేసులు తగ్గుముఖం పట్టడం కాస్త ఊరటనిస్తోంది. సోమవారం దేశవ్యాప్తంగా 14,13,951 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..26,115 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. దాంతో మొత్తం కేసులు 3.35 కోట్లకు చేరాయి.

మహంత్‌ నరేంద్రగిరి అనుమానాస్పద మృతి.. శిష్యుడి అరెస్టు

7. బ్రిటన్‌ కొవిడ్‌ ప్రయాణ నిబంధనలు.. భారత్‌ ఏమందంటే..

టీకా పొందిన భారతీయులను టీకా తీసుకోనట్లుగా పరిగణిస్తూ యూకే ప్రభుత్వం జారీ చేసిన కొవిడ్‌ ప్రయాణ నిబంధనలు కొత్త వివాదానికి తెరలేపాయి. దీంతో ఈ పరిణామాలపై స్పందించిన భారత్.. పరస్పర ప్రయోజనాలతో ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని యూకేను కోరింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి జైశంకర్‌ నేడు యూకే విదేశాంగ కార్యదర్శి లిజ్‌ ట్రస్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించిన కేంద్రమంత్రి.. క్వారంటైన్‌ నిబంధనల వివాదాన్ని కూడా ప్రస్తావించారు.

8. న్యూజిలాండ్‌ మహిళల జట్టుకు బాంబు బెదిరింపులు

ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న న్యూజిలాండ్‌ మహిళల జట్టుకు తాజాగా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ విషయాన్ని ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు ధ్రువీకరించిందని కివీస్‌ బోర్డు ప్రకటించింది. అయితే, ఈ బెదిరింపులపై తమ భద్రతా సంస్థలు దర్యాప్తు చేపట్టాయని.. అవి ఉత్తుత్తివేనని స్పష్టం చేసింది. మహిళల క్రికెటర్లు బస చేసే హోటల్‌తో పాటు స్వదేశానికి తిరిగి వెళ్లేటప్పుడు విమానంలో బాంబులు పెడతామని ఈసీబీకి ఈమెయిల్‌ వచ్చినట్లు సమాచారం అందింది. మరోవైపు పాకిస్థాన్‌ పర్యటనకు ముందే తమ పురుషుల జట్టులోని కొందరిని చంపుతామంటూ బెదిరింపులు వచ్చాయని న్యూజిలాండ్‌ క్రికెట్‌ ప్లేయర్స్‌ అసోసియేషన్‌ చీఫ్‌ హీత్‌ మిల్స్‌ వెల్లడించారు.

9. `ఎన్‌పీఎస్` ఖాతాను తెరిచే వ‌య‌స్సుని స‌వ‌రించిన `పీఎఫ్ఆర్‌డీఏ`

65 ఏళ్లు పైబ‌డిన సీనియ‌ర్ సిటిజ‌న్లు ఇపుడు ఎన్‌పీఎస్ ఖాతాను తెర‌వ‌వ‌చ్చు. 65 సంవ‌త్స‌రాల త‌ర్వాత ఎన్‌పీఎస్‌లో చేరాల‌నుకునే వారికి, ప‌న్నును ఆదా చేయ‌డం మాత్ర‌మే కాకుండా, ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన త‌ర్వాత పెన్ష‌న్‌కు అనుబంధంగా ఒక పెట్టుబ‌డిని ఏర్పాటు చేసుకోవ‌డ‌మే ల‌క్ష్యం. ఇంత‌కుముందు ఎన్‌పీఎస్ ఖాతాల‌ను మూసివేసిన చందాదారులు పెరిగిన వ‌య‌స్సు అర్హ‌త నిబంధ‌న‌ల ప్ర‌కారం కొత్త ఎన్‌పీఎస్ ఖాతాను తెర‌వ‌డానికి అనుమ‌తించ‌బ‌డ‌తారు. ఇపుడు 65 ఏళ్లు పైబ‌డిన సీనియ‌ర్ సిటిజ‌న్లు 70 సంవ‌త్స‌రాల వ‌ర‌కు నేష‌న‌ల్ పెన్ష‌న్ సిస్ట‌మ్ (ఎన్‌పీఎస్‌) ఖాతాను తెర‌వ‌డానికి కూడా అనుమ‌తించ‌బ‌డ్డారు. 

10. ప్రియ షాకింగ్ కామెంట్స్.. లహరి, రవి ఫైర్.. తేలని నామినేషన్స్..

బుల్లితెర తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’. నాగార్జున వ్యాఖ్యాతగా ప్రస్తుతం ‘బిగ్‌బాస్‌ సీజన్‌-5’ ప్రసారమవుతోంది. తాజాగా మూడోవారానికి సంబంధించి నామినేషన్స్‌ ప్రక్రియ సోమవారం అసంపూర్తిగా ముగిసింది. ప్రియ చేసిన వ్యాఖ్యల కారణంగా హౌస్‌లో యుద్ధ వాతావరణమే నెలకొంది. నామినేషన్‌ ప్రక్రియలో భాగంగా హౌస్‌మేట్స్‌కు నచ్చని ఇద్దరి పేర్లను టైల్స్‌పై ముద్రించి.. సుత్తితో పగలకొట్టాల్సిందిగా బిగ్‌బాస్‌ సూచించాడు. ఈ క్రమంలో శ్రీరామచంద్ర నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభించాడు.

రోబో.. ఆ అణుశాస్త్రవేత్త హంతకుడు..!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని