ఏపీలో యథావిధిగా పది పరీక్షలు

తాజా వార్తలు

Updated : 19/03/2020 14:11 IST

ఏపీలో యథావిధిగా పది పరీక్షలు

అమరావతి: రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ఈనెల 31 వరకు సెలవులు ప్రకటించినట్లు ఏపీ విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..పాఠశాలలు, కళాశాలలు, వర్సిటీలు, కోచింగ్‌ సంస్థలు, నర్సింగ్‌ కళాశాలలకు సెలవులు ప్రకటించినట్లు చెప్పారు. ఈనెల 23 వరకు ఇంటర్‌ పరీక్షలు యథావిధిగా జరుగుతాయని తెలిపారు.
 పదో తరగతి పరీక్షలు మార్చి 31 నుంచి యథావిధిగా నిర్వహిస్తామని వెల్లడించారు. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సెలవుల దృష్ట్యా విద్యార్థులు క్షేమంగా స్వస్థలాలకు వెళ్లేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఈనెల 31 తర్వాత మళ్లీ సమీక్షించి తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి సురేష్‌ తెలిపారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని