ఏపీలో మరో రెండుసార్లు రేషన్‌ సరకులు

తాజా వార్తలు

Published : 28/03/2020 23:01 IST

ఏపీలో మరో రెండుసార్లు రేషన్‌ సరకులు

అమరావతి: దేశవ్యాప్త లాక్‌డౌన్‌ పరిస్థితుల రీత్యా ప్రతి బియ్యం కార్డుకూ ప్రభుత్వం ఉచితంగా బియ్యం, కేజీ కందిపప్పును ఆదివారం (మార్చి 29న) పంపిణీ చేయనుంది. ఇదే మాదిరిగా ఏప్రిల్ 15న ఓసారి, 29న మరోసారి కూడా ఉచిత రేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ ఆహార భద్రతా పథకంలో లేని కార్డులకూ ఈ సాయాన్ని అందించాలని నిర్ణయించారు.

దీనికి అదనంగా ఏప్రిల్ 4న ప్రతి కార్డుదారుడికీ రూ.1000 ఆర్థిక సాయాన్ని కూడా అందించాలని సీఎం ఆదేశించారు. ఏప్రిల్ ఒకటో తేదీనే పింఛన్ల పంపిణీ కూడా పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈసారి బయోమెట్రిక్ వినియోగించొద్దని ప్రభుత్వం వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాలకు సూచనలు జారీ చేసింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని