ఉచిత వైద్యం ఎందుకు చేయలేరు

తాజా వార్తలు

Published : 27/05/2020 23:42 IST

ఉచిత వైద్యం ఎందుకు చేయలేరు

ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్సపై సుప్రీం వ్యాఖ్యలు 

దిల్లీ: ప్రభుత్వం నుంచి ఉచితంగా భూములు పొందినప్పుడు, కరోనా సోకిన వారికి ఉచిత వైద్యాన్ని ఎందుకు అందించలేవని ప్రైవేటు ఆస్పత్రులను ఉద్దేశించి సుప్రీం కోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. కరోనా రోగులకు ఉచితంగా చికిత్స అందించే విధంగా ప్రైవేటు ఆస్పత్రులను ఆదేశించే విషయంలో ప్రభుత్వానికి ఏమైనా అడ్డంకులు ఉన్నాయా? అని సుప్రీం ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది.  

‘‘ప్రభుత్వం నుంచి వారంతా భూములను (ప్రైవేటు ఆస్పత్రులు) ఉచితంగానో, తక్కువ ధరకో పొంది ఉంటారు. అలాంటప్పడు ప్రైవేటు ఛారిటబుల్ ఆస్పత్రులన్నీ కరోనా రోగులకు ఉచితంగా లేదా తక్కువ ధరకే చికిత్స అందిచాలి’’ అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మోహతాతో వ్యాఖ్యానించింది. ఛారిటీ కింద భూములు పొందిన ప్రైవేటు ఆస్పత్రులను గుర్తించి కరోనా రోగులకు ఉచితంగా చికిత్స అందించే విషయమై వాటి అభిప్రాయాన్ని వారంలోగా కోర్టుకు తెలియజేయాలని ఆదేశించింది. కరోనా రోగులకు అందించే చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రులు అధిక మొత్తంలో (సుమారు రూ. 10 లక్షలు నుంచి రూ. 12లక్షలు) ఛార్జీలు వసూలు చేస్తున్నాయని, వాటిపై కేంద్ర ప్రభుత్వం విధివిదానాలను రూపొందించాలని దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని