ఆత్మహత్య చేసుకోవాలని గోదావరిలో దూకి..

తాజా వార్తలు

Updated : 27/08/2020 08:27 IST

ఆత్మహత్య చేసుకోవాలని గోదావరిలో దూకి..

రావులపాలెం పట్టణం: అతడికి ఏ ఆపద వచ్చిందో.. ఆత్మహత్య చేసుకుందామని గోదావరిలో దూకాడు.. అంతలోనే ప్రాణాలపై ఆశ కలిగింది.. కొద్ది దూరం కొట్టుకుని వెళ్లాక ఇసుక దిబ్బలు తగలడంతో వాటిపై ఉన్న చెట్లను పట్టుకుని ఉండిపోయాడు. 15 గంటలపాటు నిరీక్షించగా స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతణ్ని రక్షించారు. ఈ సంఘటన ఆలమూరు మండలం జొన్నాడ గౌతమి వంతెనపై చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాలు ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి గ్రామానికి చెందిన కీలపర్తి శ్రీనివాసరావు ఆత్మహత్య చేసుకునేందుకు మంగళవారం సాయంత్రం జొన్నాడ వంతెన వద్దకు వచ్చి గోదావరిలో దూకాడు. కొంత దూరం వెళ్లి ప్రాణాలపై ఆశతో ఇసుక మేటలపై ఉండిపోయాడు. బుధవారం మధ్యాహ్న సమయంలో స్థానికులు చూసి ఎస్సై శివప్రసాద్‌కు సమాచారం అందించారు. సిబ్బందితో అక్కడికి చేరుకుని బోటును పంపి అతణ్ని ఒడ్డుకు తీసుకొచ్చారు. బంధువులను పిలిపించి పోలీస్‌స్టేషన్‌లో కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

గోదావరిలో ముగ్గురి గల్లంతు

యానాం: అనారోగ్య కారణాలతో ఇద్దరు, మద్యం మత్తులో మరో వ్యక్తి గోదావరి దూకిన ఘటనలు యానాంలో చోటుచేసుకున్నాయి. సీఐ గూటం శివగణేష్‌ వివరాల మేరకు అమలాపురంలోని ఏఎంజీ కాలనీకి చెందిన పెదపూడి రమేష్‌ తన స్నేహితులతో యానాంలో మంగళవారం మధ్యాహ్నం మద్యం తాగాడు. మద్యం మత్తులో మూడు గంటల తర్వాత గోదావరిలో దిగి కొట్టుకుపోయాడు. యానాంకు చెందిన వ్యాపారి ఉద్దిశ వెంకటేశ్వరరావు మంగళవారం రాత్రి స్థానిక బాలయోగి వారధి మీదనుంచి గోదావరిలో దూకి గల్లంతయ్యాడు. మరో ఘటనలో యానాం దివ్యాంగుల సంక్షేమసంఘం అధ్యక్షుడు, ఉమా ఎడ్యుకేషనల్‌ టెక్నికల్‌ సొసైటీ సలహాదారుడు వెంకటరామకృష్ణారావు(72) బుధవారం రక్త పరీక్ష చేయించుకుంటానని ఇంట్లో నుంచి వెళ్లి గోదావరిలో దూకి గల్లంతయ్యాడు. వీరిద్దరూ అనారోగ్య కారణాలతో ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని