పరీక్షల వాయిదా కోరుతూ కేఏ పాల్‌ దీక్ష
close

తాజా వార్తలు

Updated : 29/04/2021 20:03 IST

పరీక్షల వాయిదా కోరుతూ కేఏ పాల్‌ దీక్ష

విశాఖపట్నం: కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో పది, ఇంటర్‌ పరీక్షల నిర్వహణ సరికాదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ అన్నారు. విద్యార్థుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని పరీక్షలు వాయిదా వేయాలని ఆయన కోరారు. ఈ మేరకు విశాఖలోని ఆయన కన్వెన్షన్‌ భవనంలో నిరసన దీక్ష చేపట్టారు. ప్రభుత్వం నిర్ణయం మార్చుకునే వరకు దీక్ష కొనసాగిస్తానని పాల్‌ స్పష్టం చేశారు.

‘‘కరోనా విజృంభిస్తోన్న సమయంలో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు పెట్టడం సరికాదు. ఇదే అంశంపై నేను వేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టులో అడ్మిట్‌ చేశారు. రేపే వాదనలు జరుగుతాయని ఆశిస్తున్నా. 35లక్షల మంది విద్యార్థులకు మేలు జరిగే వరకు నా దీక్ష కొనసాగుతుంది. నా పిల్లల్ని పరీక్షలకు పంపడం లేదు. పరీక్షలు రద్దు చేయమని, పాస్‌ చేయమని అడగట్లేదు. రెండు నెలలు వాయిదా వేయమని కోరుతున్నా. పరీక్షలు వాయిదా పడే వరకు దీక్ష కొనసాగిస్తా. నా దీక్ష దగ్గరకు ఎవరూ రావొద్దు’’ అని కేఏ పాల్‌ అన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని