బుజ్జాయిల అనుమతి తీసుకునే డైపర్‌ మార్చాలట!

తాజా వార్తలు

Published : 01/07/2021 01:21 IST

బుజ్జాయిల అనుమతి తీసుకునే డైపర్‌ మార్చాలట!

ఇంటర్నెట్‌ డెస్క్‌: తరచూ మూత్రం పోస్తుంటారని తల్లిదండ్రులు పసిపిల్లలకు డైపర్‌ వేస్తుంటారు. అది ఎక్కువ తడిగా మారితే తీసి.. కొత్త డైపర్‌ తొడుగుతారు. అయితే, ఇక నుంచి డైపర్‌ మార్చాలంటే పసిపిల్లల అనుమతి తీసుకోవాలని ఆస్ట్రేలియాకు చెందిన చైల్డ్‌కేర్‌ సంస్థ సూచిస్తోంది.

డైపర్‌ మార్చే సమయంలో కొన్నిసార్లు పిల్లలు ఏడుస్తుంటారు లేదా అసహనంగా కనిపిస్తుంటారు. అవేవి పట్టించుకోకుండా తల్లిదండ్రులు బలవంతంగా డైపర్‌ మార్చేస్తారు. కానీ, డైపర్‌ మార్చే సమయంలో పిల్లల ఫీలింగ్స్‌ దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరముందని చైల్డ్‌కేర్‌ సంస్థ చెబుతోంది. డైపర్‌ మార్చాల్సి వచ్చినప్పుడు పిల్లల అనుమతి తీసుకోవాలని కోరుతోంది. ‘పిల్లలు సంతోషంగా ఆడుతున్న సమయంలో డైపర్‌ మార్చేందుకు ప్రయత్నిస్తే వారి సంతోషానికి అంతరాయం కలుగుతుంది. కాబట్టి పిల్లలు ఆడుకోవడం పూర్తయి ప్రశాంతంగా ఉన్నప్పుడు డైపర్‌ మార్చాలి. అలా అని.. డైపర్‌ మొత్తం తడిచి, దుర్వాసన వచ్చే వరకు ఉంచమని కాదు.. తప్పనిసరైతే ఎలాంటి పరిస్థితులున్నా మార్చాల్సిందే. కాకపోతే.. పిల్లల సంతోషానికి ఆటంకం కలిగించి మార్చకూడదు’అని సంస్థ వాదిస్తోంది. కాస్త ఎదిగిన పిల్లలైతే కచ్చితంగా వారి నుంచి అనుమతి తీసుకోవాలని, డైపర్‌ మార్చే సమయంలో సహకరించాలని కోరితే మరింత మంచిదని చెబుతోంది. దీని వల్ల తల్లిదండ్రులు.. పిల్లల మధ్య బంధం మరింత బలంగా ఉంటుందని సంస్థ వెల్లడించింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని